ప్లాస్టిక్ నిషేధం ఎక్కడ.? 

Where is the ban on plastic?– జిల్లాలో పర్యావరణానికి ముప్పు..
– అడుగడుగున అధికారుల నిర్లక్ష్యం..
నవతెలంగాణ – భువనగిరి
జిల్లాలో ప్లాస్టిక్ నిషేధం అమలు కావడం లేదు. ప్లాస్టిక్ విధిగా ఉపయోగించడంతో జిల్లాలో పర్యావరణానికి ముప్పు పెద్ద ఎత్తున ఏర్పడుతుంది. కాలువలు, గాలి భూసారము ప్లాస్టిక్తో నిండిపోతున్నాయి. దీంతో మనుషులతో పాటు జీవజాలానికి పక్షులకు జీవన మనుగడకే ముప్పు వాటిల్లుతున్నాయి. ఇప్పటికే యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రవహిస్తున్న మూసి కాలువ తో రసాయనాలతో పరివాహక ప్రాంత ప్రజలు పక్షులు, జంతువులు తినే ఆహారం,  భూగర్భ జలాలు పూర్తిగా కలుషితమైపోయ్యయి. మరోవైపు ప్లాస్టిక్ వాడకం పెరగడంతో ఈ ప్రాంతమంతా ప్లాస్టిక్ తో కలుషితమవుతున్నాయి.
ప్లాస్టిక్ నిషేధం అమలు ఎక్కడ?
పర్యావరణానికి హాని కలిగిస్తున్న ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ను నిర్మూలించేందుకు ప్రకటించిన నిషేధం అమలులో మాత్రం నిస్తేజంగా కనిపిస్తుంది. ప్లాస్టిక్ కవర్ల నిషే ధాన్ని అమలు చేయాల్సిన అధికార యంత్రాంగం నిమ్మకు నిరేత్తినట్లుగా వ్యవ హరిస్తున్నదనే విమర్శలు ఉన్నాయి. నిషేధంలో కీలక భూమికను పోషించాల్సిన అధికారులు సిబ్బంది ఇప్పటికీ (ఏళ్లు గడుస్తున్న) క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టే నామమాత్రపు దశలోనే ఉంది.
25 రకాల ప్లాస్టిక్ వస్తువులపై నిషేధం
అలంకరణ కోసం వాడే ధర్మోకోల్, క్యాండీ స్టిక్, ఐస్క్రీమ్ స్టిక్, ప్లాస్టిక్ జెండాలు, ప్లాస్టిక్ ఫోర్టు, చెంచాలు, ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాస్లు, ఇయర్బడ్స్ సహా అనేక సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులపై కేంద్రప్రభుత్వం 2022 జూలైలో నిషేధం ప్రకటించింది. కేంద్ర పర్యా వరణశాఖ నోటిఫికేషన్ జారీ చేసి దాదాపు 2 ఏళ్లు గడుస్తున్నా అధికారులు మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదని, మీన మేషాలు లెక్కించడంతోనే కాలాన్ని గడిపేస్తు న్నారనే విమర్శలు వస్తున్నాయి.
అవగాహన లేని యంత్రాంగం
ప్లాస్టిక్ నిషేధం అమలుపై ఇప్పటికి  జిల్లాలో మున్సిపాలిటీలలో, గ్రామపంచాయతీలో ఉన్న సిబ్బందికి తగిన అవగాహన కల్పించ లేదు. కేంద్రం నిషేధించిన ప్లాస్టిక్ వస్తువుల వివరాలు పారిశుధ్య నిర్వాహణ చేస్తున్న జవాన్లకు తెలియని పరిస్థితి ఉందంటే ఆశ్చర్యం కలగక మానదు. నిషేధం అమలు లోకి వచ్చి రెండు సంవత్స రాలవుతున్నా అడపాదడపా తనిఖీలు నిర్వహిస్తున్న పూర్తిస్థాయిలో నిషేధం అమలు చేయడంలో విఫలమవుతున్నారు.
పరికరాలు ఎవి?
గతంలో 50 మైక్రాన్ల లోపు మందం కలి గిన ప్లాస్టిక్ కవర్లను నిషేధించినప్పుడు వాటి మందం కొలిచేందుకు మైక్రో మీటర్ల పరికరం  జిల్లాలో ఎక్కడ కొనుగోలు చేయలేదు . మొదట్లో హడా విడి చేసి, క్రమంగా నిషేధం అమలు మాట మరిచిపోయారు.
షాపుల్లో ప్లాస్టిక్ అమ్మకాలు.
షాపులో ప్లాస్టిక్ పెద్ద ఎత్తున అమ్మకాలు నిర్వహిస్తున్నారు.  మెుదట హడావుడి చేసిన  తరువాత నిషేధం అమలుపై పెద్దగా దృష్టి సారించలేదు. ఇప్పుడు కనీస  కన్నేతి చూడడం లేదు.
ప్లాస్టిక్ నిషేధం కఠినంగా అమలు చేయ్యలి: బట్టుపల్లి అనురాధ. సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యురాలు
పర్యావరణం, మనవ, జీవజాతుల మనుగడకు నేడు అత్యంత ప్రమాదకరమైన ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధం చేయడానికి  ప్రజలలో ఎప్పటికప్పుడు మరింత అవగాహన కల్పిస్తూ, ఉత్పత్తిదారులపై, అమ్మకపుదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. జిల్లాలో ని  మున్సిపల్ కేంద్ర లలో హోల్సేల్, రిటైల్ షాపులలో బహిరంగముగా అమ్మకాలు చేస్తున్న పట్టించుకోకుండా సంబందత అధికారులు చోద్యం చూస్తున్నారు. వ్యాపారులకు ప్లాస్టిక్ స్థానంలో  ప్రత్యామ్నాయలను అందుబాటులోకి తీసుకరావాలి. షాపుల కు ముందుగా నోటీసులు ఇచ్చి అనంతరం ట్రేడ్ లైసెన్స్ లను రద్దు చేయ్యలని డిమాండ్ చేశారు.