
పసుపుబోర్డు కార్యాలయం ఎక్కడ!! పసుపుకు 15000 రూపాయలు మద్దతు ధర ఈ సంవత్సరం ఇవ్వాలని .. రాష్ట్ర ప్రభుత్వం పసుపుకు క్వింటాలకు ₹1000 బోనస్ ఇవ్వాలని, రైతు జేఏసీ నాయకులు. వి ప్రభాకర్.. దేగామ్ యాదగౌడ్ లు డిమాండ్ చేశారు. రైతు జేఏసీ పాత్రికేయ సమావేశం పట్టణంలోని కుమార్ నారాయణ భవన్ లో నిర్వహించినారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాలుగు దశాబ్దాల పోరాటాల ఫలితంగా పసుపు బోర్డు సాధన జరిగిందని హర్షం వ్యక్తం చేశారు.. మరోవైపు పసుపు బోర్డు ప్రధాన కార్యాలయం.. నిజాంబాద్ జిల్లా నా… ఢిల్లీ కేంద్రం గా ఉంటుందా చైర్మన్ స్పష్టం చేయాలని కోరారు.. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ గారు బోర్డును ఏర్పాటు చేస్తాం.. పసుపు క్వింటాలకు 15వేల రూపాయలు ధర వచ్చే విధంగా చట్టపరమైన చర్యలు చేపడతాం అని హామీ ఇచ్చిన విషయం గుర్తు చేస్తూ ఈ సంవత్సరం 15000 రూపాయలు ధర వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ మార్కెట్లో వ్యాపారులు కృత్రిమంగా ధర తగ్గిస్తూ ఈరోజు కొన్ని కుప్పలకు మాత్రమే 12000 క్వింటాలని చూపిస్తున్నాయి కానీ 90% పైగా ఎనిమిది వేల రూపాయల క్వింటాల్ చొప్పున మాత్రమే పలుకుతుందని వాస్తవాల్ని చూయించకుండా వ్యాపార మార్కెట్ అధికారులు ప్రచారం చేయడానికి తప్పుపట్టారు..
సంతోషమే అదే సమయంలో బోర్డు కేంద్ర కార్యాలయం నిజామాబాద్ జిల్లాలో ఉందా? స్పష్టం చేయాలి రెండోది 15 వేల రూపాయలు వచ్చే విధంగా ఎంఎస్పి ద్వారా ఇప్పిస్తానని హామీ ఇచ్చారు.. మీ హామీ ఏమైంది అని ప్రశ్నిస్తున్నామన్నారు. అట్లాగే పసుపుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా అన్ని పంటలకు 500 రూపాయలు బోనస్ ఇస్తానని ఇప్పటికి ఒక పంటకు మాత్రమే ఇచ్చారని అందుకుగాను పసుపు తొమ్మిది మాసాల సాగు.. పెట్టుబడి ఎకరాకుల లక్ష 50 వేల రూపాయలు ఉంటుంది అందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం పసుపుకు క్వింటాలకు వెయ్యి రూపాయలు బోనస్ ఇవ్వాలని.. కృత్రిమంగా ధర తగ్గించే వ్యాపారులపై కఠినమైన చర్య తీసుకోవాలని.. కలెక్టర్ గారు వెంటనే జోక్యం చేసుకొని వ్యాపార, రైతుల, రైతు సంఘాలతో ఉమ్మడి సమావేశం నిర్వహించి ధర తగ్గకుండా చూడాలని కోరారు.
ఈరోజు కేంద్ర బడ్జెట్ 50 లక్షల 65,345 రూపాయలతో ప్రతిపాదన ఉంది.. 65% వ్యవసాయ రంగంపై ఆధారపడి.. దేశ ఆదాయంలో సైతం తమ వంతు ఆదాయాన్ని సమకూర్చి పెడుతున్న వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేసిందని రైతు వ్యతిరేక బడ్జెట్ గా పేర్కొన్నారు.. ఏ రువుల సబ్సిడీ 3,412 తగ్గించడం మోడీ రైతు వ్యతిరేక స్వభావాన్ని స్పష్టం చేస్తుందని అన్నారు.. వ్యవసాయ రంగం కేటాయించిన వ్యవసాయ రంగానికి కేటాయించామని చెప్పుకుంటున్న 1,71,000కోట్లల్లో చూయించే పద్దు లో,మత్స్య శాఖ కూడా ఉందని విషయాన్ని గుర్తు చేస్తున్నాం.. కోటి మందికి ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తామని కొండంత రాగం తీసి ఏదో పాట పాడినట్లుగా 616 కోట్లు కేటాయించి చేతులు దులుపుకున్నారని ఎద్దేవా చేశారు.. ఈ బడ్జెట్లో పసల్ బీమా సాగునీటి వసతులు రైతు బీమా కేటాయింపులు లేని లేవని గుర్తు చేశారు. ఈ ప్రజావ్యత్రిక బడ్జెట్ అని ఈ రైతు వ్యతిరేక బడ్జెట్ అని అన్నారు.. ఈ బడ్జెట్ను వ్యవసాయ రంగానికి అనుకూలంగా పెద్ద మొత్తం కేటాయింపులతో సవరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని అన్నారు. ఈ సమావేశంలో జేఏసీ నాయకులు, దేవారం, సురిబిర్యాల లింగారెడ్డి, మంథని గంగారాం, స్వామి యాదవ్, కిషన్, ప్రసాద్, చేపూరి విజయ్, తదితరులు పాల్గొన్నారు..