స్టేట్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (ఎస్.సి.ఇ. ఆర్.టి). స్థాపన లక్ష్యాలను మరిచిపోయి ప్రయోగాల మీద ప్రయోగాలు చేస్తూ పాఠశాల విద్యావ్యస్థను మొత్తం పతనం అంచుకు తీసుకువచ్చింది. దేశంలోను, ప్రపంచ వ్యాప్తంగా విద్యా సంబంధిత అంశాలలో వచ్చే మార్పు లను గమనించి స్థానిక పరిస్థితులకు తగినట్టుగా పాఠశాలలను, ఉపాధ్యాయులను తయారుచేసేందుకు పాఠ్యపు స్తకాలను తయారు చేయాల్సిన సంస్థ కాపీ పేస్టు మేధావులను చేరదీసి కాలం వెల్లబుచ్చుతున్నది. ఉపాధ్యాయులుగా నియామ కమై పాఠశాలకు వెళ్లి పాఠాలు బోధించకుండా, పట్ట ణాల్లో తిష్ట వేయడం కోసం పైరవీలు చేసుకునే పనికి మాలిన వాళ్ళందరికి డిప్యూటేషన్లు పెట్టబడి ఏండ్లతర బడి గబ్బిలాల్ల వేలాడే వందిమాగదుల ఓ పునరావాస కేంద్రమే ఎస్.సి.ఇ.ఆర్.టి అనే అపవాదు మూటగట్టు కుంది. రిటైరై ఏండ్లు గడిచిన వాళ్ళను కొనసాగిస్తారు. అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొని చేయరాని అడ్డమై న చెడుపనులన్ని చేసిన వాళ్ళకు కూడా అందులో ఆశ్ర యం కల్పిస్తారు. డిప్యూటేషన్‌కు, ఫారిన్ సర్వీస్‌కు కాల పరిమితిని నిర్వచించని అపరిమిత అధికారాలు గల సంస్థ ఇదొక్కటే!
సి.సి.ఇ రద్దు చేయాల్సిందే
ఇక దాని పనివిధానం, ప్రయోగాలను చూస్తే సి.సి.ఇ ఒక విఫల ప్రయోగమని మన దేశ విద్యావిధానానికి సరిపోదని దానిని ప్రవేశపెట్టిన సి.బి.ఎస్.ఇ, దేశంలోని 27 రాష్ట్రాలు రద్దు చేసినా, రాష్ట్రంలోని మేధావులు, ప్రజా సంఘాలు, విదార్థి సంఘాలు, తల్లిదండ్రులు ఎవ్వరు డిమాండ్ చేసినా కేవ లం డిప్యూటేషన్ల కోసమే రద్దు చేయకుండా కొనసాగిస్తున్నా రంటే ఆశ్చర్యం కలుగమానదు. డిప్యూటేషన్లకు సి.సి.ఇ ఒక ఉపాధి పథకం. దానికి అనేక పిల్ల ప్రయోగాలు పుట్టిచ్చి కొన్ని వందలమంది పాఠశాలలు ఎగ్గొట్టి కాలం వెల్లబుచ్చే ఒక కాలక్షేప వర్గాన్ని తయారు చేసిన పథకం అది. ట్రైనింగ్‌లు, మాడ్యూల్స్ ప్రింటింగ్, టి.ఏ, డి.ఏ, కార్ల ఎంగేజ్‌ల పేరుతో అడ్డగోలు అవి నీతి జరుగుతున్నా అడిగేనాథుడే లేడు. కొద్దిరోజులు పరీక్షల విధానంలో, మరికొద్ది రోజులు పాఠ్య పుస్తకాలలో, ఇప్పుడు ఎఫ్. ఎల్.ఎన్, ఉన్నతిల పేరిట ఉపాధ్యాయుల బోధనలో సంస్కర ణలు ఇలా పూటకో ఆలోచన, గడియకో నిర్ణయంతో ఉపాధ్యా యులను గజిబిజికి గురిచేస్తున్నారు. ఏ ప్రయోగానికి కాల పరిమితి, సమీక్షా లేదు.
నిపుణులతో పుస్తకాలు రాయించాలి
గతంలో యూనివర్సిటీలలో, సీఫెల్ లాంటి విద్యా సంస్థ లలో పనిచేసే సుదీర్ఘ బోధానానుభవం కలిగిన ఉన్నత విద్యా వంతులతో పుస్తకాలు, పాఠ్యాంశాలు రాయించేవారు. విద్యార్థుల స్థాయికి తగ్గట్టుగా వారి పరిణతి పెంచేవిధంగా అవి ఉండేవి. 10వ తరగతి వరకు ఉండే పాఠ్యపుస్తకాలు సెంట్రల్, స్టేట్ పోటీ పరీక్షలకు కూడా ఉపయోగపడే ప్రామాణికత కలిగి ఉపయోగ పడేవి. కాని అదేం కర్మోగాని ఇందులో డిప్యూటేషన్లపై ఉన్న మే ధావులకు అర్హత, అనుభవం లేని తమ కాపీ, పేస్ట్ అస్మదీయు లతోనే పుస్తకాలు రాయిస్తే ఎలా వుంటదనే వెర్రి ఆలోచన వారి పుర్రేలో పుట్టిందే తడవుగా అమలు పరుచడంతో, వాళ్ళు తమ పైత్యాన్నంత పాఠ్యాంశాలలో రుద్దడంతో బోధించాల్సిన సిలబస్ విపరీతంగా పెరిగిపోయి విద్యార్థులకు అటు అర్థంకాక, ఇటు చదువు రాక విద్యా వ్యవస్థ సర్వనాశనమైంది.
విద్యార్థిపై ప్రయోగాలు ఆపాలి
విద్యార్థిని ఒక రిపోర్టర్‌గా, రచయితగా, కవిగా, సమీక్షకుడి గా, నటునిగా, కొరియోగ్రాఫర్‌గా, నాటక కర్తగా, చిత్రకారునిగా, గాయకునిగా, వ్యాసకర్తగా, డి.టి.పి ఆపరేటర్‌గా ఇంకా ఇలా అనేక రకాలుగా మార్చాలనే సంకల్పం పైకి చూస్తే బాగానే ఉన్నట్టు, విద్యావ్యవస్థలో ఓ అద్భుత విద్యార్థిని సృష్టించబోతు న్నట్లు వాళ్ళు ప్రవేశపెట్టిన ప్రయోగాలు చూస్తే అని పిస్తుంది. ఇంత చిన్న పిల్లలకు అవిఅవసరమా అనే ప్రశ్నతో భయం కూడా వేస్తుంది! రాత్రికి రాత్రే విద్యా ర్థిని మార్చేసి మహామేధావిని చేయాలనే సంకల్పాన్ని ఎస్.సి. ఇ.ఆర్.టి ఎందుకు తలకెత్తుకున్నదో బుర్ర బద్దలు కొట్టుకున్నా అర్థంకాదు. ఇన్ని అంశాలు ఒక విద్యార్థిలో ఎలా ఇమిడి ఉంటా యో అటుంచి ఇది తయారు చేసిన వారిలో ఉన్నాయా అనే విష యం దీనిని ప్రవేశపెట్టిన మేధావులకే తెలియాలి! పదో తరగతి వరకు చదవడం, రాయడం, అర్థం చేసుకోవడం నేర్పించాలా లేక మేధావిని తయారు చేయాలా? ప్రపంచమంతా విద్యార్థిని గ్లోబల్ సిటిజన్ తయారు చేయాలని కలలు కంటుంటే ఈ సంస్థ ఏమి రాకుండా చేసే ప్రయోగాలు చేస్తున్నది! ప్రయోగాలు లే కుండా ప్రయివేటు పాఠశాలలు నడుస్తుంటే, పేద విద్యార్థులకు చదువు రాకుండా చేసే కుట్రలు ఇందులో ఉన్నవారు ఎందుకు చేస్తున్నారో, ఏ వర్గ ప్రయోజనాల కోసమో అర్థంకాదు. ఏమ న్నంటే మీరు చదువు చెప్పాల్సిన అవసరం లేదు, విద్యార్థే అంతా నేర్చుకుంటాడు అని సూత్రీకరణ. పాఠ్యపుస్తకాలను మార్చి తెలు గుకు తెగులు పుట్టించారు. ఇంగ్లీష్‌లో ఇంగ్లీష్ లేదు, చదివితే మాట్లాడటం రాదు! లెక్కలు, సైన్స్ సబ్జెక్ట్‌లను చూస్తే జుట్టు పీక్కోవాలి. సోషలంతా కలగాపులగం, ఎకామిక్స్, జాగ్రఫీ, హి స్టరీ, సివిక్స్ ఎక్కడెక్కడున్నాయని పుస్తకమంతా ఈతకొట్టి వెదు క్కొవాలి. వాక్యాలనుండి పదాలు, అక్షరాలు నేర్చుకోవాలట! అట్లై తేనే చదువు వస్తదని దశాబ్దాల నుండి తిష్ట వేసుకొని కూర్చున్న డిప్యూటేషన్ మేధావుల కొత్త సూత్రీకరణ! మీరు చదువు గిట్లనే నేర్చుకున్నారా అయ్యా అంటే ఏ సమాధానం రాదు! పైకెళ్ళి మళ్లీ విద్యార్థులకు చదువడం రాయడం ఎందుకు వస్తలేదు అని ప్రశ్న. మళ్ళీ కొత్త ప్రయోగాలు వాటికి ట్రైనింగ్‌లు, వాటిని ఇవ్వడానికి మళ్ళీ తమ అస్మదీయులకు అవకాశం కల్పించడం.
అన్ని డిప్యూటేషన్లు, ఫారిన్ సర్వీసులు, ఆక్రమ నియామకాలు రద్దు చేయాలి
ఇదే ఎస్.సి.ఇ.ఆర్.టి మొన్నటికి మొన్న అత్యంత రహ స్యంగా (ఫోన్ల ద్వారా మనవాళ్ళకు మాత్రమే అని మరీ ఎంపిక చేసి) 100కు పైబడి తమ అస్మదీయ ఉపాధ్యాయులకు డిప్యూటేషన్ పెట్టి వెంటనే డైట్స్‌లో రిపోర్టు చేయమని ఉత్తర్వు ఇచ్చారు. వాళ్ళకి ఏ టెస్ట్‌లేదు, పరీక్ష రాయనూ లేదు, వాళ్ళ గొప్పతన మేంటో ఎవ్వరికి తెలియదు. వాళ్ళు పనిచేసే పాఠశాలల విద్యార్థులు రోడ్లమీదకి వచ్చి మా ఉపాధ్యాయుడు మాకు కావాలి అని ధర్నా చేసినా ఎవ్వరు పట్టించుకోవడంలేదు? అందునా పదో తరగతి పరీ క్షలు సమీపిస్తున్న సమయంలో. వీరందరిని ఉన్నతి, ఎఫ్.ఎల్.ఎన్ ఏ విధంగా పాఠశాలల్లో జరుగుతుందో పరిశీలించడానికి ఎగదోశారు. అధికారులు చేయాల్సిన పనిని ఉపాధ్యాయులు ఎలా చేస్తారు? ఉపాధ్యాయుల జాబ్ చార్ట్‌లో బోధన చేయాలనుందా? మానిటరింగ్ చేయాలనుందా? ఒక హోదాలో ఉన్నవారిని అదే హోదాలో ఉన్నవారు ఎలా పరీక్షిస్తారు అని ఉత్తర్వులు ఇచ్చే అధికారులైన ఆలోచించాలిగా? విద్యార్థిని పరిశీ లిస్తే ఉపాధ్యాయుడి బోధన తెలుస్తుంది. కాని వాళ్లు పాఠశాల ల్లోకి వచ్చి తమతోటి వారి బోధనను హేళన చేయడం, వాట్సప ్‌లో మెసేజ్ పెట్టడం, వీడియోలు అప్‌లోడ్ చేయడం ఎంత వరకు సమంజసం? పంటచేళ్ళ మీద మిడుతలదండు దాడి లాగా ఒకేసారి ఏడు నుండి ఎనిమిది మంది వరకు తరగతి గదిలో కూర్చొని బోధనను స్కానింగ్ చేస్తే ఒక ఉపాధ్యాయుడు బోధించడం సాధ్యమవుతుందా? మహిళా ఉపాధ్యాయుల పరి స్థితి ఏమిటి? పై హోదాలో ఉన్నవారిని ఆదేశించే అధికారం వారికుందా? సబార్డినేట్ సర్వీస్‌రూల్స్‌లేని ఓ వ్యవస్థ నుండి ఓ మహిళను ఏకంగా పక్షంగా నియమించిన విధానం చూస్తే తన అస్మదీయుల కోసం ఎస్.సి.ఇ.ఆర్.టి తెగబడి ఏ విధంగా నిబం ధనలు ఉల్లంఘిస్తుందో ఇట్టే అర్థమైపోతుంది. విద్యాశాఖ నిర్ణయించిన పాఠశాల సెలవులను ఎస్.సి.ఇ.ఆర్.టి ఎలా రద్దు చేస్తుందో, ఎందుకు రద్దు చేస్తుందో అర్థంకాదు? గతే డాది చివరి వరకు కూడా పదోతరగతికీ పరీక్షలకు ఎన్ని పేపర్లుం టాయో ఎవ్వరికి తెలుపకుండా నిగూఢంగా ఉంచి చివరకు 6 పేపర్లుగా నిర్ణయంచి ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్ పరీక్ష లు ఒకేసారి, ఒకేరోజు రాయాలని నిర్ణయించడం విస్మయాన్ని కలిగించడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనం.
కొత్త విద్యాశాఖ కార్యదర్శి, కొత్త ప్రభుత్వం కొన్ని డిప్యూటేష న్లను 23జనవరి2024 తేదీ రోజున ఇచ్చిన ఉత్తర్వు ద్వారా రద్దు చేయడం శుభపరిణామం అయిన ఎస్.సి.ఇ.ఆర్.టి ప్రక్షాళన చే యడంలో భాగంగా దశాబ్దాలుగా తిష్టవేసుకొని కూర్చొన్న, రిటైరై కొనసాగుతున్న, అక్రమ పద్ధతిలో వచ్చిన వాళ్ళందరిని, డిప్యూటే షన్‌పై ఉన్న వారిని తొలగించాలి. విద్యార్థులపై ప్రయోగాలపై ప్రయోగాలు చేసే అన్ని విధానాలను ఆపివేయాలి. అన్ని రాష్ట్రా లు ఎత్తివేసినట్టుగానే సి.సి.ఇ విధానాన్ని రద్దుచేసి సెమిస్టర్ విధానం లేదా పాత విధానాన్ని పునరుద్దరించాలి. పాఠ్యపుస్తకా లను గతంలో మాదిరిగా విద్యార్థికి ఉపయోగపడే విధంగా, చదువు వచ్చేవిధంగా ఉపయోగకరంగా రూపొందించాలి. ఎస్.సి.ఇ.ఆర్.టి తన పరిధి దాటి విద్యాశాఖ నిర్ణయాలలో జోక్యం చేసుకునే విధానాలకు అడ్డుకట్టవేయాలి. అప్పుడు మాత్రమే పాఠశాల విద్యావ్యవస్థ బాగుపడే అవకాశముంది.
– ఏ.శ్రీదేవి