1 ఉత్తర తెలంగాణకు వరప్రదాయినిగా పేర్కొనే ప్రాజెక్టు
1) నిజాం సాగర్ ప్రాజెక్టు 2) శ్రీరాంసాగర్ ప్రాజెక్టు
3) ఆలీసాగర్ ప్రాజెక్టు
4) ఆర్గుల రాజారాం ఎత్తిపోతల పథకం
2. ప్రపంచంలోనే అతిపెద్ద, అతి ఎత్తైన రాతికట్టడం, ఆధునిక దేవాలయంగా ప్రసిద్ధి చెందిన ప్రాజెక్టు?
1) నాగార్జున సాగర్ ప్రాజెక్టు 2) శ్రీరాంసాగర్ ప్రాజెక్టు
3) ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు 4) కాళేశ్వరం ప్రాజెక్టు
3. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు జవహర్ లాల్ నెహ్రూ ఎప్పుడు శంకుస్థాపన చేశారు?
1) 1955 డిసెంబర్ 30 2) 1955 డిసెంబర్ 23
3) 1955 డిసెంబర్ 10 4) 1955 డిసెంబర్ 20
4. జలయజ్ఞంలో భాగంగా రాష్ట్రంలో ప్రారంభించిన తొలి ఎత్తిపోతల పథకం ఏది?
1) నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం
2) అర్గుల రాజారాం ఎత్తిపోతల పథకం
3) దేవాదుల ఎత్తిపోతల పథకం
4) ఆలీసాగర్ ఎత్తిపోతల పథకం
5. జూరాల ప్రాజెక్టు ప్రస్తుతం ఏ జిల్లాలో కలదు?
1) జోగులాంబ గద్వాల్ 2) వనపర్తి
3) మహబూబ్‌నగర్ 4) నాగర్‌కర్నూల్
6. రాజోలిబండ మళ్లింపు పథకం ఏ రెండు రాష్ట్రాల మధ్య ఉమ్మడి ప్రాజెక్టు?
1) మహరాష్ట్ర, తెలంగాణ 2) చత్తీస్‌గఢ్, తెలంగాణ
3) కర్ణాటక, తెలంగాణ 4) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
7. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని పరివాహక ప్రాంతంలో లేని జిల్లా ఏది?
1) మహబూబ్‌నగర్ 2) రంగారెడ్డి
3) నల్గొండ 4) వరంగల్
8. జతపర్చుము :
1) కాళేశ్వరం ప్రాజెక్టు ఎ) పెన్‌గంగా
2) తుమ్మిడి హట్టి బి) ప్రాణహిత
3) చనాఖా-కొరాటా సి) గోదావరి
1) 1-ఎ,2-బి,3-సి 2) 1-బి,2-సి,3-ఎ
3) 1-సి,2-బి,3-ఎ 4) 1-సి,2-ఎ,3-బి
9. కాళేశ్వరం ప్రాజెక్టు పరివాహక ప్రాంతంలో ఉండే జిల్లాలు ?
1) కరీంనగర్, మెదక్, నల్గొండ, నిజామాబాద్
2) కరీంనగర్, మెదక్, నల్గొండ, ఆదిలాబాద్
3) కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం
4) కరీంనగర్, మహబూబ్‌నగర్, వరంగల్, ఖమ్మం
10. బొగ్గులవాగు ప్రాజెక్టు ఏ జిల్లాలో కలదు?
1) జయశంకర్ భూపాలపల్లి 2) మహబూబ్‌నగర్
3) జనగామ 4) వరంగల్ రూరల్
11. పోచారం ప్రాజెక్టును ఏ నదిపై నిర్మించారు?
1) పాలేరు 2) ఆలేరు
3) శబరి 4) కిన్నెరసాని
12. తాలిపేరు ప్రాజెక్టు, పెద్దవాగు ప్రాజెక్టులు ప్రస్తుతం ఏ జిల్లాలో కలవు?
1) ఖమ్మం 2) జనగామ
3) భద్రాద్రి కొత్తగూడెం 4) మహబూబ్‌నగర్
13. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణం వనులు 1963 ప్రారంభించగా ఏ సంవత్సరం నాటికి పూర్తి చేశారు?
1) 1976 2) 1977
3) 1980 4) 1978
14. ప్రస్తుతం సింగూరు ప్రాజెక్టు ఏ జిల్లాలో కలదు?
1) మెదక్ 2) సిద్దిపేట
3) సంగారెడ్డి 4) వికారాబాద్
15. కోయిల్‌సాగర్ ప్రాజెక్టును ఏ నదిపై నిర్మించారు?
1) కృష్ణ 2) భీమా
3) డిండి 4) పెద్దవాగు
16. గోదావరి నదిపై నిర్మించబడిన కంతనపల్లి సుజల స్రవంతి పథకం ఏ జిల్లాలో కలదు?
1) వనపర్తి 2) మహబూబ్‌నగర్
3) జయశంకర్ భూపాపల్లి 4) జనగామ
17. భక్తరామదాసు ఎత్తిపోతలు పథకం ఏ జిల్లాలో కలదు?
1) ఖమ్మం 2) యాదాద్రి భువనగిరి
3) భద్రాద్రి కొత్తగూడెం 4) జనగామ
18. సీతారామా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రస్తుతం ఏ జిల్లాలో కలదు?
1) భద్రాద్రి కొత్తగూడెం 2) జనగామ
3) మహబూబ్‌నగర్ 4) ఖమ్మం
19. వైరా ప్రాజెక్టు
1) ఖమ్మం 2) శబరి
3) సీలేరు 4) కిన్నెరసానీ
20. లంకసాగర్ ప్రాజెక్టును ఖమ్మం జిల్లాలో ఏ నదిపై నిర్మించారు?
1) కట్లేరునది 2) శబరి
3) సీలేరు 4) కిన్నెరసానీ
21. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఏ నదిపై అడ్డ (కొమురం భీం) ప్రాజెక్టును నిర్మిస్తున్నారు?
1) పెద్దవాగు 2) రాళ్లవాగు
3) సుద్దవాగు 4) చెలిమలవాగు
22. గద్దెనవాగు ప్రాజెక్టును ఏ నదిపై నిర్మించారు?
1) వట్టివాగు 2) సుద్దవాగు
3) పెద్దవాగు 4) మతాడివాగు
23. నల్గొండ జిల్లాలోని ఫ్లోరైడ్ బాధితులను విముక్తి కల్పించడానికి ఉద్దేశించిన పథకం?
1) డిండి ఎత్తిపోతల పథకం 2) నక్కలగండి ప్రాజెక్టు
3) పై రెండు
4) ఏదకాదు
24. రాజోలి బండ మళ్లింపు పథకం ఏ నదిపైన నిర్మించారు?
1) కృష్ణ 2) భీమా
3) తుంగభద్ర 4) ఘటప్రభ
25. కడెం రిజార్వాయర్ ప్రస్తుతం ఏ జిల్లాలో కలదు?
1) మంచిర్యాల 2) ఆదిలాబాద్
3) ఆసిఫాబాద్ 4) నిర్మల్
26. కరీంనగర్ వాసులకు ట్యాంక్ బండ్ అనుభూతిని కల్గిస్తున్న ప్రాజెక్టు?
1) లోయర్ మానేరు 2) మధ్య మానేరు
3) ఎగువ మానేరు 4) ఏదీకాదు
27. గండిపేట (ఉస్మాన్‌సాగర్) ప్రాజెక్టు ఉద్దేశ్యం
1) మూసీనది వలన కలిగే వరదల నుండి హైద్రాబాద్‌ను కాపాడటం
2) హైద్రాబాద్ నగర ప్రజలకు త్రాగునీటికోసం
3) పై రెండు 4) ఏదీకాదు
28. ఎగువ మానేరు డ్యాం ప్రస్తుతం ఏ జిల్లాలో కలదు?
1) రాజన్న సిరిసిల్ల 2) పెద్దపల్లి
3) జగిత్యాల 4) జనగామ
29. గొల్లవాగు ప్రాజెక్టు, నీల్వాయి ప్రాజెక్టులు ఏ జిల్లాలో కలవు?
1) మంచిర్యాల 2) ఆదిలాబాద్
3) నిర్మల్ 4) కొమురం భీం ఆసిఫాబాద్
30. అసిఫ్‌నహర్ ప్రాజెక్టు, శాలిగౌరారం ప్రాజెక్టులు ప్రస్తుతం ఏ జిల్లాలో కలవు?
1) నల్గొండ 2) సూర్యాపేట
3) జనగామ 4) యాదాద్రి భువనగిరి
31. వట్టివాగు ప్రాజెక్టు, చెలిమెలవాగు (ఎన్టీఆర్ సాగర్) ప్రాజెక్టులు ప్రస్తుతం ఉన్న జిల్లా ఏది?
1) మంచిర్యాల 2) ఆదిలాబాద్
3) జగిత్యాల 4) కొమురం భీం ఆసిఫాబాద్
సమాధానాలు
1. 2 2. 1 3. 3 4. 4 5. 1 6. 3 7. 4 8. 3 9. 1 10. 1 11. 2 12.3 13.4 14.3 15. 4 16. 3 17. 1 18. 1 19. 1 20. 1 21. 1 22. 2 23. 3 24. 4 25. 4 26. 1 27. 3 28. 1 29. 1 30. 4 31. 4