1. భౌగోళికంగా తెలంగాణ ప్రాంతం ఈ క్రిందివాటిలో దేనిలో అంతర్భాగము?
1) బుందేల్బండ్ పీఠభూమి 2) మాల్వా పీఠభూమి
3) దక్కన్ పీఠభూమి 4) ఏదీకాదు
2. ఉనికి రీత్యా తెలంగాణ ప్రాంతం ఉన్న గోళార్ధం?
1) ఉత్తరార్ధగోళం 2) దక్షిణార్ధగోళం
3) పై రెండు 4) ఏదీకాదు
3. ఉనికి రీత్యా తెలంగాణ ప్రాంతం ఈ క్రిందివాటిలో ఏ ప్రాంతంలో అంతర్భాగము?
1) ఉత్తర ఆసియా 2) దక్షిణాసియా
3) పశ్చిమ ఆసియా 4) తూర్పు ఆసియా
4. తెలంగాణ ప్రాంతం యొక్క సాధారణ ఎత్తు ఈ క్రింది విధంగా ఉంటుంది?
1) పడమర దిశనుండి తూర్పు దిశవైపుకు తగ్గుచున్నట్లు
2) తూర్పు దిశ నుండి పడమర దిశవైపు తగ్గుచున్నట్లు
3) పై రెండు
4) ఏదీ కాదు.
5. తెలంగాణ ప్రాంతంలో సముద్ర మట్టం నుండి 600 మీటర్లు ఆపైన ఎత్తుగల ప్రాంతంలో లేనిది ఏది?
1) హైద్రాబాద్ 2) రంగారెడ్డి
3) మెదక్ 4) నిజామాబాద్
6. తెలంగాణ రాష్ట్ర భూభాగం ఈ క్రింది ఆకారంలో కలదు?
1) సమబాహు త్రిభుజం 2) అసమబాహు త్రిభుజం
3) సమద్విబాహు త్రిభుజం 4) చతురస్రం
7. తెలంగాణ రాష్ట్రంలో ఈ క్రింది వాటిలో అతిపెద్ద ప్రాంతం ఏది?
1) గోదావరి బేసిన్ 2) తెలంగాణ పీఠభూమి
3) కృష్ణ బేసిన్ 4) ఏదీకాదు
8. జిల్లాల విభజన తర్వాత సత్నాల కొండలు దేనిలో అంతర్భాగము?
1) ఆదిలాబాద్ 2) మంచిర్యాల
3) కుమురంభీం ఆసిఫాబాద్ 4) నిర్మల్
9. రాఖీ కొండలు ఏ జిల్లాలో కలవు?
1) పెద్దపల్లి 2) జగిత్యాల
3) కరీంనగర్ 4) ఏదీకాదు
10. యల్లండ్లపాడు గుట్టలు, రాజు గుట్టలు ఏ జిల్లాలలో కలవు?
1) ఆదిలాబాద్, మంచిర్యాల 2) నల్గొండ, సూర్యాపేట
3) నిజామాబాద్, కామారెడ్డి 4) ఖమ్మం, భద్రాద్రి భువనగిరి
11. అమ్రాబాద్ కొండలు ఏ జిల్లాలో కలవు?
1) నాగర్ కర్నూల్ 2) మహబూబ్‌నగర్
3) వనపర్తి 4) జోగులాంబ గద్వాల్
12. అనంతగిరి విస్తరించి ఉన్న జిల్లా?
1) హైద్రాబాద్ 2) ఖమ్మం
3) వికారాబాద్ 4) నల్గొండ
13. రాచకొండలు విస్తరించి ఉన్న జిల్లాలు
1) నల్గొండ 2) వికారాబాద్
3) మహబూబ్‌నగర్ 4) పైవన్నీ
14. హైద్రాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాలలో వ్యాపించి ఉన్న కొండలు ఈ క్రింది పర్వతాలకు చెందినవి?
1) బాలాఘాట్ పర్వతాలు 2) పాలఘాట్ పర్వతాలు
3) పై రెండు 4) ఏదీకాదు
15. నల్లమల కొండలు ఏ జిల్లాలో కలవు?
1) మహబూబ్‌నగర్ 2) వనపర్తి
3) నాగర్ కర్నూల్ 4) జోగులాంబ గద్వాల్
16. సిర్పూర్ కొండలు ఏ జిల్లాలో కలవు?
1) కుమ్రంభీం ఆసిఫాబాద్ 2) మంచిర్యాల
3) జగిత్యాల 4) నిర్మల్
17. రామగిరి కొండలు ఏ జిల్లాలలో కలవు?
1) జగిత్యాల 2) పెద్దపల్లి
3) నిర్మల్ 4) ఆదిలాబాద్
18. తూర్పు కనుమలు నిర్మాణం దృష్ట్యా తూర్పు కొండలుగా తెలంగాణ రాష్ట్రంలోని మొదటగా ఏ జిల్లాలో విస్తరిస్తాయి?
1) మహబూబ్ నగర్ 2) వనపర్తి
3) నాగర్‌కర్నూల్ 4) ఏదీకాదు
19. కందికల్ కొండలు ఏ జిల్లాలో కలవు
1) జయశంకర్ 2) మహబూబ్‌నగర్
3) వరంగల్ అర్బన్ 4) ఏదీకాదు
20. తెలంగాణ ప్రాంతం సముద్ర మట్టానికి ఎంత ఎత్తులో ఉంటుంది?
1) 480 నుండి 600 మీటర్లు 2) 200 నుండి 400 మీటర్లు
3) 250 నుండి 550 మీటర్లు
4) 200 నుండి 500 మీటర్లు
21. తెలంగాణలో తూర్పు కనుమల్లో ఎత్తైన కొండ లక్ష్మీదేవిపల్లి ఏ జిల్లాలలో కలదు?
1) మెదక్ 2) మహబూబ్‌నగర్
3) సిద్ధిపేట 4) జోగులాంబ-గద్వాల్
22. గోండ్వానా శిలల్లో ప్రధాన ఖనిజం
1) నేలబొగ్గు 2) ఇనుము
3) బంకమన్ను 4) బెరైటీస్
23. తెలంగాణ పశ్చిమ కనుమలలో ఎత్తైన శ్రేణి?
1) సత్నాల 2) లక్ష్మీదేవిపల్లి
3) సోలామైల్ 4) మహబుబ్ ఘాట్
24. బసాల్ట్ లావాతో ఏర్పడిన కోత మైదానాలు ఏ జిల్లాల్లో వ్యాపించి ఉన్నాయి?
1) రంగారెడ్డి 2) మహబూబ్‌నగర్
3) పై రెండు 4) ఏదీకాదు
25. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైద్రాబాద్ సముద్రమట్టం నుండి ఎంత ఎత్తులో ఉంది?
1) 600 మీటర్లు 2) 650 మీటర్లు
3) 500 మీటర్లు 4) 550 మీటర్లు
26. సిర్నాపల్లి కొండలలో ఉండే తెగ ఏది?
1) కోయలు 2) వాల్మికీ బోయ
3) పర్బాన్‌లు 4) ఖైతి (ఖయితీ) లంబాడీలు
27. గోదావరి బేసిన్లో లేని ప్రాంతం ఈ క్రిందివానిలో ఏది?
1) ఏటూరు నాగారం 2) మెట్‌పల్లి
3) భీమ్‌గల్ 4) మిర్యాలగూడ
28. ఈ క్రింది వాటిలో ఏ కొండలు సిర్నాపల్లి నుండి ఆర్మూర్ వరకు విస్తరించి ఉన్నాయి?
1) సిర్నాపల్లి కొండలు 2) రాతి కొండలు
3) బూజు కొండలు 4) ఏదీకాదు
29. ఈ క్రింది వాటిలో నీస్, గ్రానైట్ శిలలు లేని జిల్లా ఏది?
1) నిజామాబాద్ 2) కామారెడ్డి
3) సంగారెడ్డి 4) ఏదీకాదు
30. పాండవుల గుట్టలు ఏ జిల్లాలలో కలవు?
1) వరంగల్ అర్బన్ 2) మహబూబ్‌నగర్
3) జయశంకర్ భూపాలపల్లి 4) వనపర్తి
31. కింది వాటిలో జియోలాజికల్ సర్వే ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి చెందిన శిలలు ఏవి?
1) వింధ్య శిలలు 2) గోండ్వానా, ద్రవిడియన్ శిలలు
3) ఆర్కియన్ శిలలు 4) పైవన్నీ
32. మెసోజోయిక్ కాలానికి చెందిన దక్కన్ ట్రాప్‌లు ఏ శిలలతో నిర్మితమైనవి?
1) బసాల్ట్ శిలలు 2) ఆర్కియన్ శిలలు
3) ద్రవిడియన్ శిలలు 4) రూపాంతర శిలలు
33. లక్ష్మిదేవిపల్లి కొండలు ఏ జిల్లాలో ఉన్నాయి?
1) కామారెడ్డి 2) సిద్ధిపేట
3) మెదక్ 4) నిర్మల్
34. తెలంగాణలోని పశ్చిమ కనుమలను ఏమని పిలుస్తారు?
1) అనంతగిరి 2) సహ్యద్రి/సత్నాల
3) బాలాఘాట్ 4) ఏదీకాదు
35.తెలంగాణాలో వశ్చిమ కనుమల్లో ఎత్తైన శ్రేణి- మహబూబాఘాట్ ఏ జిల్లాల్లో ఉంది?
1) నిర్మల్ 2) జయశంకర్
3) కొమురంభీం 4) ఆదిలాబాద్
36. తెలంగాణ ప్రాంతం సముద్రమట్టం నుండి ఎత్తైన ప్రదేశం ఉండటం వలన ఉష్ణోగ్రత ఏ విధంగా ఉంటుంది?
1) ఉష్ణోగ్రత తక్కువ 2) ఉష్ణోగ్రత ఎక్కువ
3) ఉష్ణోగ్రత సమానంగా 4) ఏదీకాదు
37. తెలంగాణ శీతోష్ణస్థితి ఏ రుతుపవన శీతోష్ణస్థితి అంటారు?
1) ఉప ఆయన రేఖ 2) ఆయన రేఖ
3) పై రెండు 4) ఏదీకాదు
38. కొప్పన్ శీతోష్ణస్థితి వర్గీకరణ ప్రకారం తెలంగాణ ప్రాంతం ఈ కింది వాటిలో ఏ రకానికి చెందినది?
1) ఆర్థ ఉపశుష్క 2) అనర్ధ ఉపశుష్క
3) ఉపశుష్క 4) ఏదీకాదు
39. వేసవికాలంలో క్యుములోనింబస్ మేఘాలవల్ల అప్పుడప్పుడు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతాన్ని ఏమంటారు?
1) పర్వతీయ వర్షపాతం 2) సంవాహన వర్షపాతం
3) చక్రవాత వర్షపాతం 4) ఏదీకాదు
40. తెలంగాణ ప్రాంతం వడగాలులు ఎక్కువగా ఏ నెలలో వీస్తాయి?
1) మే 2) ఏప్రిల్
3) జూన్ 4) ఫిబ్రవరి
41. తెలంగాణ ప్రాంతంలో సాధారణంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే ప్రాంతం?
1) భద్రాద్రి కొత్తగూడెం 2) కామారెడ్డి
3) రామగుండం 4) ఏదీకాదు
42. తెలంగాణ ప్రాంతంలో సాధారణంగా అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు అయ్యే ప్రాంతం ఏది?
1) ఆదిలాబాద్ 2) నిజామాబాద్
3) ఖమ్మం 4) హైద్రాబాద్
43. ఏ నెలను వర్షకాలానికి మరియు శీతాకాలానికి మధ్యయ సంధిమాసంగా వ్యవహరిస్తారు?
1) సెప్టెంబర్ 2) నవంబర్
3) డిసెంబర్ 4) అక్టోబర్
44. ఈశాన్య ఋతుపవన కాలంలో అత్యధిక వర్షపాతం పొందే జిల్లా ఏది?
1) హైద్రాబాద్ 2) రంగారెడ్డి
3) మెదక్ 4) కరీంనగర్
45. ఈశాన్య ఋతుపవన కాలంలో అత్యల్ప వర్షపాతం పొంచే జిల్లా ఏది?
1) హైద్రాబాద్ 2) ఆదిలాబాద్
3) ఖమ్మం 4) పాత కరీంనగర్
46. ఈశాన్య ఋతుపవన కాలంలో ఏ రకము వర్షపాతం కల్గుతుంది?
1) సంవాహన వర్షపాతం 2) పర్వతీయ వర్షపాతం
3) చక్రవాత వర్షపాతం 4) ఏదీకాదు
47. తెలంగాణ మొత్తం మీద అత్యధిక వర్షపాతం సంభవించే జిల్లా ఏది?
1) ఆదిలాబాద్ 2) పెద్దపల్లి
3) ఖమ్మం 4) భద్రాద్రి కొత్తగూడెం
48. తెలంగాణ మొత్తం మీద అత్యల్ప వర్షపాతం సంభవించే జిల్లా ఏది?
1) సిద్ధిపేట 2) పాత మహబూబ్‌నగర్
3) జగిత్యాల 4) పెద్దపల్లి
49. తెలంగాణలో ఎక్కువగా వర్షాలు కురిసే ప్రాంతం
1) మానేరు బేసిన్ 2) పాలేరు బేసిన్
3) సీలేరు బేసిన్ 4) శబరి బేసిన్
50. నైరుతి ఋతుపవన కాలం
1) జూన్ నుండి సెప్టెంబర్ 2) జూన్ నుండి అక్టోబర్
3) జూలై నుండి అక్టోబర్ 4) ఏదీకాదు
51. సాధారణంగా నైరుతి ఋతుపవనాలు తెలంగాణ ప్రాంతానికి ఎప్పుడు చేరుకుంటాయి?
1) జూన్ మొదటివారం 2) జూన్ రెండవ వారం
3) పై రెండు 4) ఏదీకాదు
52. దక్షిణ తెలంగాణ ప్రాంతం నుండి ఉత్తర తెలంగాణ ప్రాంతానికి వెళ్లేకొలది వర్షపాతం?
1) తగ్గుతుంది 2) పెరుగుతుంది
3) ఎలాంటి మార్పు ఉండదు 4) ఏదీకాదు
సమాధానాలు
1. 3 2.1 3.2 4.1 5.4
6.3 7.2 8.1 9. 2 10.4
11.1 12.3 13.4 14.1 15.3
16.1 17.2 18.1 19. 3 20.1
21.3 22.1 23.4 24.3 25.1
26.4 27.4 28.1 29.4 30.3
31.4 32.1 33.2 34.2 35.1
36.1 37.2 38.3 39.2 40.1
41.3 42.1 43.4 44.1 45.4
46.3. 47.1 48.2 49.3 50.1
51.3 52.2