ఈ క్రింది వాటిలో మహబూబ్‌నగర్‌ జిల్లాలో ప్రవహించే నది ఏది?

1. జతపర్చుము.
1. గోదావరి నది ఎ. పశ్చిమ కనుమలలోని నాసిక్‌ త్రయంబకం
2. కృష్ణానది బి. సాత్పూరా పర్వతాలు
3. మంజీర నది సి. పశ్చిమ కనుమలలోని మహబలేశ్వరం
4. ప్రాణహితనది డి. బాలాఘాట్‌ పర్వతాలు
1. 1-ఎ,2-సి,3-డి,4-బి 2. 1-ఎ,2-సి,3-బి,4-డి
3.1-సి,2-ఎ,3-డి,4-బి 4. 1-ఎ,2-బి,3-సి,4-డి
2. ఈ క్రింది వాటిలో గోదావరి నదికి ఉపనది కానిది ఏది?
1. కోయనా 2. శబరి 3. పూర్ణ 4. ప్రవరా
3. ఏ నదిని పురాణాలలో తెలివాహనది పేర్కొన్నారు.
1.మంజీర 2.కృష్ణ
3.గోదావరి 4.తుంగభద్ర
4. జతపర్చుము.
1.తుంగభద్రనది ఎ. అజీవనది (నాన్‌- పెరినియాల్‌)
2.దిండినది బి.ముచుకుందనది
3.మూసీనది సి.మీనాంబరం
4.మంజీరనది డి. రామాయణంలో పంపానది
1.1-డి,2-సి,3-ఎ,4-బి 2.1-సి,2-డి,3-బి,4-ఎ
3.1-డి,2-సి,3-బి,4-ఎ 4.1-సి,2-డి,3-ఎ,4-బి
5. తెలంగాణలో కృష్ణానది యొక్క పరివాహక ప్రాంతాలు ఏవి?
1. నాగర్‌కర్నూల్‌, మహబూబ్‌నగర్‌, వనపర్తి, గద్వాల్‌, నల్గొండ, సూర్యాపేట
2. నాగర్‌కర్నూల్‌, మహబూబ్‌నగర్‌, నిర్మల్‌, జగిత్యాల, నల్గొండ, సూర్యాపేట
3.మహబూబ్‌నగర్‌, కొమురం-భీం ఆసిఫాబాద్‌, పెద్దపల్లి, నల్గొండ, నాగర్‌కర్నూల్‌
4. నల్గొండ, సూర్యాపేట, వరంగల్‌ రూరల్‌, వరంగల్‌ అర్బన్‌, మహబూబ్‌నగర్‌
6. ఈ క్రింది వాటిలో సరికానిది ?
1. మహబూబ్‌నగర్‌- భీమ, డిండి, తుంగభద్ర
2. వరంగల్‌ – పాలేరు, మున్నేరు
3. నిజామాబాద్‌ – మంజీర, పూరాంగీ
4. రంగారెడ్డి – వైరా, కిన్నెరసాని, శబరి, సీలేరు
7. ఈ క్రింది వాటిలో సరికానిది?
1. కృష్ణానది-ప్రియదర్శిని జూరాల, నాగార్జున సాగర్‌
2. మంజీరనది- నిజాం సాగర్‌ ప్రాజెక్టు, సింగూర్‌ ప్రాజెక్టు
3. గోదావరి నది-శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు
4. తుంగభద్ర నది-ఉస్మాన్‌సాగర్‌ ప్రాజెక్టు
8. ఈ క్రింది వాటిలో కృష్ణనది ఉపనది ఏది?
1. కోయనా 2. కాగ్నా 3. హాలియా 4. పైవన్నీ
9. జతపర్చుము.
1. మానేరు నది ఎ. సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల కొండలు
2. మున్నేరు నది బి. వరంగల్‌ రూరల్‌, మహబూబ్‌నగర్‌, సరి హద్దులో పాకాల చెరువు
3. కాగ్నానది సి. వికారాబాద్‌ జిల్లా అనంతగిరి కొండలు
4. కడెం నది డి. ఆదిలాబాద్‌ జిల్లాలోని బోతాయి గ్రామం
1. 1-ఎ,2-బి,3-సి,4-డి 2 1-ఎ,2-బి,3-డి,4-సి
3. 1-బి,2-ఎ,3-సి,4-డి. 4. 1-ఎ,2-సి,3-డి,4-బి
10. తెలంగాణ రాష్ట్రంలో నదులు ప్రవహించే దిశ?
1. భారతదేశంలో వాయువ్యాన ఎత్తుగా ఉండి ఆగేయ దిశగా వాలి ఉంటుంది. కాబట్టి రాష్ట్రంలో ప్రవహించే నదుల దిశ వాయువ్యం నుండి ఆగేయం వైపు ఉంటుంది.
2. రాష్ట్రంలో ప్రవహించే నదుల దిశ ఆగేయ నుండి పడమరకు
3. రాష్ట్రంలో ప్రవహించే నదుల దిశ నైరుతి నుండి ఆగేయం
4. రాష్ట్రంలో ప్రవహించే నదుల దిశ నైరుతి నుండి ఈశాన్యం
11. గోదావరి నదికి సంబంధించి ఈ క్రింది వాటిలో సరైనది ఏది?
1. దక్షిణ భారతదేశంలోని నదులన్నిటిలోకి పెద్దది.
2. గోదావరి నదికి గల ఇతర పేర్లు దక్షిణ గంగా, వృద్ధ గంగా, ఇండియన్‌ రైన్‌
3. గోదావరి నది మొత్తం పొడవు 1465 కి.మీ. దీని పరివాహక ప్రాంతం
తెలంగాణలో 7 జిల్లాలలో ఉంది.
4. పైవన్నీ
12. ఈ క్రింది వాటిలో సరైనది ఏది?
1. కృష్ణనది యొక్క అదిపెద్ద ఉపనది తుంగభద్ర, గోదావరినదికి అతిపెద్ద ఉపనది ప్రాణహితనది
2. కృష్ణనది యొక్క ఉపనదులలో పొడవైన నది-భీమానది
3. గోదావరి నది యొక్క ఉపనదులలో పొడవైనది
4. పైవన్నీ
13. కృష్ణనదికి సంబంధించి ఈ క్రిందివాటిలో సరైనది ఏది?
1. కృష్ణానది యొక్క మొత్తం పొడవు 1440 కి.మీ.
2. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కృష్ణానది యొక్క పొడవు 720 కి.మీ.
3. కృష్ణానది యొక్క పరివాహక ప్రాంతం తెలంగాణలో 6 జిల్లాలో కలదు.
4. పైవన్నీ.
14. జయశంకర్‌-భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంవద్ద ఏర్పడే త్రివేణిసంఘమం నదులలో లేనిది ఏది?
1. గోదావరి 2. ప్రాణహిత
3. సరస్వతి 4. పెన్‌గంగా
15. నిజామాబాద్‌ జిల్లా కందకుర్తి వద్ద ఏర్పడే త్రివేణి సంఘమంలో లేని నది ఏది?
1. మంజీర 2. హరిద్ర
3. గోదావరి 4. పూర్ణ
16. ‘దక్షిణ గంగా’ అని ఏ నదిని పిలుస్తారు?
1. కృష్ణ 2. పెన్నా
3. గోదావరి 4. ప్రాణహిత
17. మహారాష్ట్రలో ‘మంజ్రా’ అని ఏ నదిని పిలుస్తారు?
1. మానేరు 2. ఇంద్రావతి
3. ప్రాణహిత 4. మంజీరా
18. క్రింది వాటిలో ఏ ఆనకట్టను రాజన్న-సిరిసిల్ల జిల్లాలో నర్మల గ్రామ సమీపంలో నిజాం కాలంలో నిర్మించారు?
1. దిగువ మానేరు ఆనకట్ట 2. ఎగువ మానేరు అనకట్ట
3. నిజాం సాగర్‌ ఆనకట్ట 4. మధ్య మానేరు ఆనకట్ట
19. క్రింది వాటిలో ఏ నది సింకరం వద్ద తూర్పు కనుమలలో పుట్టి కోలబ్‌ నదిగా మారుతుంది?
1. ప్రాణహిత 2. కృష్ణా 3. శబరి 4. గోదావరి
20. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఏ నదిపై కాళేశ్వరం సమీపంలో మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి ప్రతిపాదనలు చేసింది?
1. దిండి 2. ప్రాణహిత
3. పాలేరు 4. మున్నేరు
21. ఈ క్రింది వాటిలో మహబూబ్‌నగర్‌ జిల్లాలో ప్రవహించే నది ఏది?
1. దిండి 2. మంజీరా
3. ప్రాణహిత 4. పాలేరు
22. ముచికుంద నది అని ఏ నదిని పిలిచేవారు?
1. ఇంద్రావతి 2. పాలేరు
3. మున్నేరు 4. మూసీ
23. కృష్ణానది సముద్ర మట్టానికి ఎన్ని మీటర్ల ఎత్తులో ఉంది?
1. 1,441 మీటర్లు 2. 1,526 మీటర్లు
3. 945 మీటర్లు 4. 1,337 మీటర్లు
24. గోదావరి నది సముద్ర మట్టానికి ఎంత ఎత్తులో ఉంది?
1. 884 మీటర్లు 2. 707 మీటర్లు
3. 1,067 మీటర్లు 4. 945 మీటర్లు

సమాధానాలు
1. 1 2. 1 3. 3 4. 3 5. 1 6. 4 7. 4 8. 4 9. 1 10. 1 11. 4 12. 4 13. 4 14. 4 15. 4 16. 3 17. 4 18. 2 19. 3 20. 2 21. 1 22. 4 23. 4 24. 3