కాంగ్రెస్ పార్టీ పతనానికి నేతల తీరే కారణం

ఆసక్తికరంగా గ్రేటర్ ఫలితాలు .. ఉనికి కోసం కాంగ్రెస్ పోరాటం …. అడ్రెస్ లేని టీడీపీ

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలలో కమల వికాసం కొనసాగుతోంది. ఈ ఎన్నికల ఫలితాలు టిఆర్ఎస్ పార్టీకి చెంపపెట్టు అన్న భావన వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఉనికిని కోల్పోతున్నట్లుగా తాజా ఎన్నికల ఫలితాల బట్టి తెలుస్తోంది. ఇక ఈ ఎన్నికలలో పోటీ చేసిన టీడీపీ ఖాతా తెరవలేదు . కనీసం ఒక్క చోట కూడా ఆధిక్యం ప్రదర్శించలేదు . గత దుబ్బాక ఎన్నికల్లో అడ్రస్ లేకుండా పోయిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు జిహెచ్ఎంసి ఎన్నికల్లోనూ అదే పంథాను కొనసాగిస్తోంది. ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ కేవలం రెండు, మూడు స్థానాల్లోనే ఆధిక్యతను కనబరుస్తూ ఉండడం ఒక జాతీయ పార్టీకి రావలసిన ఫలితం కాదని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

కాంగ్రెస్ పార్టీ పతనానికి నేతల తీరే కారణం

జిహెచ్ఎంసి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పెద్దగా ప్రచారం చేయకపోవడం, జాతీయ స్థాయి నేతలను కాంగ్రెస్ పార్టీ కోసం ప్రచారానికి రాకపోవడం, ఒకపక్క దుబ్బాక ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ ఇచ్చినప్పటికీ, కాంగ్రెస్ పార్టీ నేతల్లో సమన్వయం కొరవడడం, పార్టీలో ఉన్న గ్రూపు రాజకీయాలు కాంగ్రెస్ పార్టీని పతనావస్థకు చేర్చాయి అనడంలో సందేహం లేదు. ఇక ఈ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తులో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ, ఆపై జరగనున్న గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లోనూ పునరావృతమైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇక తాజా ఫలితాలను బట్టి కాంగ్రెస్ పార్టీ ఉనికిని కోల్పోతుంది, తెలంగాణ రాష్ట్రంలో పట్టు కోల్పోతుంది అన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

No. Party Name Votes
1 Congress 1000
2 TTP 700
3 Janasena 500
4 BJP 450
5000
2000
1000