ఏ నేలలను భారతదేశపు ధాన్యాగారాలుగా పేర్కొంటారు?

ICAR– భూమి ఉపరితలంపై వదులుగా ఉన్న పొరనే ‘నేల’ అంటారు.
– నేలను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ‘పెడాలజీ’ లేదా ‘ఎడపాలజీ’ అంటారు.
– నేలల పుట్టుకను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ”పెడోజెనేసిస్‌” అంటారు.
– మృత్తికల స్వభావం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ”లీథాలజీ” అంటారు.
– శిలలు శైథిల్యం చెందే ప్రక్రియను వెదరింగ్‌ అంటారు.
– ప్రపంచ ధరిత్రి దినోత్సవం – ఏప్రిల్‌ 22
– వరల్డ్‌ వెట్‌ ల్యాండ్స్‌ డే – ఫిబ్రవరి 2
– వ్యవసాయం యోగ్యమైన నేల న విలువ: 6.5 నుండి 7.5 మధ్య ఉంటుంది.
– శిలలు శైథిల్యం చెందగా ఏర్పడే పదార్థాన్ని ‘మృత్తిక’ అంటారు.
– తెలంగాణ రాష్ట్రం భారత ద్వీపకల్పంలోని ఈస్ట్రన్‌ సీ బోర్డ్‌ మధ్య పేలికలో దక్కన్‌ పీఠభూమి ఉంది.
– తెలంగాణ రాష్ట్రం అధిక సారవంతమైన ఒండ్రు నేలల నుంచి నిస్సారమైన ఇసుక నేలల వరకు పలు రకాల నేలలను కలిగి ఉంది. తెలంగాణలో ఎగుడు, దిగుడులు గల పెనిప్లేయిన్లు కలిగి ఉన్నప్పటికీ ఎర్ర నేలలు, నల్ల నేలలు, లాటరైట్‌ నేలలు విస్తరించి ఉన్నాయి.
– రాష్ట్రంలో ప్రధానంగా ఎర్ర నేలలు, ఒండ్రు నేలలు, నల్లరేగడి నేలలు, లాటరైట్‌ నేలలు విస్తరించి ఉన్నాయి.
-Soil Survey of India – 1956.
8 Indian Council of Agriculture Research (ICAR) –
– ICAR (ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ రీసెర్చ్‌) న్యూఢిల్లీ సంస్థ దేశంలో నేలలను 8 రకాలుగా వర్గీకరించింది.
656
1. నేలల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
1) లిథాలజి 2) పోమాలజి
3) మెట్రోలజి 4) పెడాలజీ
2. ఎర్ర నేలల యొక్క ూన విలువ ఎంత?
1) 6.0 నుండి 7.5 2) 7.8 నుండి 7.8
3) 6.0 నుండి 6.8 4) 6.0 నుండి 8.0
3. అత్యంత సారవంతమైన నేలలు?
1) ఒండ్రు నేలలు 2) నల్లరేగడి నేలలు
3) ఎర్ర నేలలు 4) లాటరైట్‌ నేలలు
4. సుగంధ ద్రవ్యాల పంటలకు అనుకూలమైన నేలలు?
1) నల్లరేగడి నేలలు 2) లాటరైట్‌ నేలలు
3) ఎర్ర నేలలు 4) ఒండ్రు నేలలు
5. ఆదిలాబాద్‌ జిల్లాలో తక్కువగా ఉండే నేలలు?
1) ఒండ్రు నేలలు 2) లాటరైట్‌ నేలలు
3) ఎర్ర నేలలు 4) నల్లరేగడి నేలలు
6. ఈ క్రింది వాటిలో ఏ నేలలను దుబ్బనేలలు, చెల్క నెలలుగా వర్గీకరించారు?
1) నల్లరేగడి నేలలు 2) ఎర్ర నేలలు
3) ఒండ్రు నేలలు 4) లాటరైట్‌ నేలలు
7. ఏ నేలలను ఉపయోగించి ఇటుకలను తయారు చేస్తారు?
1) నల్లరేగడి నేలలు 2) రాతినేలలు
3) ఎర్ర నేలలు 4) ఒండ్రు నేలలు
8. ఏ నేలలను భారతదేశపు ధాన్యాగారాలుగా పేర్కొంటారు?
1) ఒండ్రు నేలలు 2) ఎర్రనేలలు
3) లాటరైట్‌ నేలలు 4) నల్లరేగడి నేలలు
9. వరంగల్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాలలో తక్కువ విస్తరించి ఉన్న నేలలు ఏవి?
1) ఎర్ర నేలలు 2) ఒండ్రు నేలలు
3) నల్లరేగడి నేలలు 4) లాటరైట్‌ నేలలు
10. ఏ నేలలతో పౌష్టిక, సేంద్రియ పదార్థాలు తక్కువ ఉండి, భాస్వరం అధికంగా ఉంటుంది?
1) ఒండ్రు నేలలు 2) లాటరైట్‌ నేలలు
3) ఎర్ర నేలలు 4) నల్లరేగడి నేలలు
11. అల్యూమినియం, ఇనుప (ఫెరిక్స్‌) హైడ్రైడ్‌ అక్సైడ్‌ మిశ్రమం కల్గి ఉన్న నేలలు ఏవి?
1) రాతి నేలలు 2) ఎర్ర నేలలు
3) ఒండ్రు నేలలు 4) నల్లరేగడి నేలలు
12. ఎర్ర నేలలో ప్రధానంగా పండే పంట?
1) వేరుశనగ 2) ప్రత్తి
3) జీడి మామిడి 4) గోధుమ
13. ఏ నేలలు తక్కువసారం కల్గి ఉండి పాలిపోయిన బూడిద రంగులో కనబడతాయి?
1) నల్లరేగడి నేలలు 2) ఎర్ర నేలలు
3) ఒండ్రు నేలలు 4) లాటరైట్‌ నేలలు
14. నల్లరేగడి మృత్తికలు ఏర్పడటానికి గల కారణం
1) అవక్షేప శిలలు 2) రూపాంతర శిలలు
3) షేల్స్‌ 4) పైవన్నీ
15. నల్లరేగడి నేలల యొక్క ూన విలువ ఎంత?
1) 6.0 నుండి 7.5 2) 7.8 నుండి 8.7
3) 6.0 నుండి 6.8 4) 6.0 నుండి 8.0
16. ఏ నేలలో పొటాష్‌, సున్నపురాయి సమృద్ధిగా ఉండి నత్రజని శాతం తక్కువగా ఉంటుంది?
1) ఓండ్రు నేలలు 2) లాటరైట్‌ నేలలు
3) ఎర్ర నేలలు 4) నల్ల రేగడి నేలలు
17. ఏ నేలలో లావా, నీస్‌, గ్రానైట్‌ శిలలతో ఏర్పడుతాయి?
1) ఎర్ర నేలలు 2) లాటరైట్‌ నేలలు
3) నల్లరేడి నేలలు 4) ఒండ్రు నేలలు
18. ఏ నేలలను రేగర్‌ నేలలు అని అంటారు?
1) నల్లరేగడి నేలలు 2) ఎర్ర నేలలు
3) ఒండ్రు నేలలు 4) లాటరైట్‌ నేలలు
19. ఏ నేలలలో ఇనుము, కాల్షియం శాతం ఎక్కువగా ఉంటుంది?
1) ఎర్ర నేలలు 2) ఒండ్రు నేలలు
3) నల్లరేగడి నేలలు 4) లాటరైట్‌ నేలలు
20. ఏ నేలలో భాస్వరం, సేంద్రియ పదార్థాలు తక్కువగా ఉంటాయి?
1) ఒండ్రు నేలలు 2) ఎర్ర నేలలు
3) నల్లరేగడి నేలలు 4) లాటరైట్‌ నేలలు
21. రాతినేల యొక్క ూన విలువ ఎంత?
1) 6.0 నుండి 7 2) 3.0 నుండి 7.8
3) 6.0 నుండి 6.8 4) 7.8 నుండి 8.8
22. ఏ నేలలు ఎక్కువ వర్షపాతం, ఎక్కువ ఉష్ణోగ్రత, అధిక తేమను కల్గి ఉంటాయి?
1) ఒండ్రు నేలలు 2) ఎర్ర నేలలు
3) నల్లరేగడి నేలలు 4) రాతి నేలలు
23. కాపీ, తేయాకు, రబ్బరు వంటి పంటలకు అనుకూలమైన నేలలు?
1) రాతి నేలలు 2) ఒండ్రు నేలలు
3) ఎర్ర నేలలు 4) నల్లరేగడి నేలలు
24. ఒండ్రు నేలలో పండే పంటలు?
1) వరి, చెఱకు 2) అరటి, మామిడి
3) నిమ్మ, బత్తాయి 4) పైవన్నీ
25. ఏ నేలలు పంట దిగుబడికి ఎక్కువగా దోహదపడుతాయి?
1) ఎర్ర నేలలు 2) ఒండ్రు నేలలు
3) రాతి నేలలు 4) నల్లరేగడి నేలలు
26. ఏ నేలలు సాధారణంగా క్షారస్వభావాన్ని కల్గి ఉంటాయి?
1) ఒండ్రు నేలలు 2) ఎర్ర నేలలు
3) లాటరైట్‌ నేలలు 4) నల్లరేగడి నేలలు
27. జతపర్చుము :
1) ఎర్ర నేలలు ఎ) 48%
2) ఒండ్రు నేలలు బి) 20%
3) లాటరైట్‌ నేలలు సి) 7%
4) నల్లరేగడి నేలలు డి) 25%
1) 1-ఎ,2-బి,3-సి,4-డి
2) 1-బి,2-ఎ,3-సి,4-డి
3) 1-ఎ,2-బి,3-డి,4-సి
4) 1-ఎ,2-సి,3-బి,4-డి
28. ఏ నేలలు ఎక్కువగా బంకమట్టిని కల్గి ఉండి, తేమను నిల్వచేసుకునే సామర్థ్యం ఉంటుంది?
1) నల్లరేగడి నేలలు 2) ఎర్ర నేలలు
3) ఒండ్రు నేలలు 4) లాటరైట్‌ నేలలు
29. ఏ నేలలకు నీటిని నిలువ చేసుకునే సామర్థ్యం ఉంటుంది?
1) ఎర్ర నేలలు 2) ఒండ్రు నేలలు
3) లాటరైట్‌ నేలలు 4) నల్లరేగడి నేలలు
30. సాధారణంగా ఏ నేలలు పసుపురంగులో ఉంటాయి?
1) ఒండ్రు నేలలు 2) ఎర్ర నేలలు
3) లాటరైట్‌ నేలలు 4) నల్లరేగడి నేలలు
31. కేంద్రీయ అటవీ పరిశోధనల సంస్థ ఎక్కడ ఉంది?
1. చండీగడ్‌ 2. ఊటీ
3. డెహ్రడూన్‌ 4. హైద్రాబాద్‌
32. ఐ.సి.ఏ.ఆర్‌. (ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ రీసెర్చ్‌) న్యూఢిల్లీ సంస్థ దేశంలో నేలలను ఎన్ని రకాలుగా వర్గీకరించింది?
1. 5 2. 7 3. 8 4. 9
33. తెలంగాణలో ఎర్ర నేలల శాతం ఎంత?
1. 25% 2. 5%
3. 33% 4. 48%
34. ఈ క్రిందివాటిలో ”తనను తాను దున్నుకొను నేలల”ని వేటిని అంటారు?
1. ఎర్రనేలలు 2. లాటరైట్‌ నేలలు
3. నల్లరేగడి నేలలు 4. ఒండ్రు నేలలు
35. తెలంగాణలో నల్లరేగడి నేలల శాతం ఎంత?
1. 4% 2. 25%
3. 20% 4. 48%
36. లాటరైట్‌ నేలలు తెలంగాణలో ఏ ప్రాంతాలలో విస్తరించి ఉన్నాయి ?
1. జహీరాబాద్‌, నారాయణఖేడ్‌, ఆదిలాబాద్‌
2. జహీరాబాద్‌, నారాయణఖేడ్‌, కరీంనగర్‌
3. జహీరాబాద్‌, నారాయణఖేడ్‌, ఖమ్మం
4. జహీరాబాద్‌, నారాయణఖేడ్‌, మెదక్‌
37. ఈ క్రింది వాటిలో వేటిని ”జేగురు నేలలు” అంటారు?
1. ఎర్రనేలలు 2. లాటరైట్‌ నేలలు
3. ఒండ్రు నేలలు 4. నల్లరేగడి నేలలు
38. తెలంగాణ రాష్ట్రంలో లాటరైట్‌ నేలల విస్తీర్ణ శాతం?
1. 7% 2. 2.3%
3. 4.5% 4. 5.7%
39. ఈ క్రింది వానిలో అత్యంత సారవంతమైన నేలలు ఏవి?
1. లాటరైట్‌ నేలలు 2. ఒండ్రునేలలు
3. నల్లరేగడి నేలలు 4. ఎర్రనేలలు
40. తెలంగాణలో ఒండ్రునేలలు ఎంత శాతం విస్తరించి ఉన్నాయి?
1. 20% 2. 25%
3. 5.5% 4. 48%
సమాధానాలు
1.1 2.1 3.1 4.2 5.3
6.2 7.2 8.1 9.3 10.3
11.1 12.1 13.2 14.4 15.2
16.1 17.3 18.1 19.3 20.3
21.3 22.4 23.1 24.4 25.2
26.1 27.1 28.1 29.4 30.1
31.2 32.3 33.4 34.3 35.2
36.3 37.2 38.1 39.2 40.1