కేసు కోర్టులో ఉండగానే సర్వే కోసం భూమి పైకి వెళ్లినా రెవెన్యూ అధికారులు

నవతెలంగాణ- మహబూబ్‌ నగర్‌
ధరణి పోర్టల్‌ పట్టాదారుడి భూమి పైకి కోర్టు వాయిదా ఉండగానే బుధవారం రెవెన్యూ అధికారులు సర్వే కోసం భూమి పైకి వెళ్ళిన ఘటన మహబూబ్‌ నగర్‌ రూరల్‌ మండలంలో జరిగింది. వివరాల్లోకి వెళితే మహబూబ్‌ నగర్‌ రూరల్‌ మండలంలోని గాజులపేట గ్రామ శివారులో నాగులపల్లి శ్రీనివాసులు గల పది గుంటల భూమిపైకి తహసీల్దార్‌ పాండు ,ఆర్‌ఐ క్రాంతి బృందం సర్వే కోసం వెళ్లారు. అక్కడే ఉన్న పట్టాదారుడు ఈ భూమిని మేము కొనుగోలు చేశామని చెప్పారు. ఒక్కసారి రైతుబంధు కూడా వచ్చిందని అధికారులకు గుర్తుచేశారు. అధికారులు మాత్రం గతంలో ఈ భూమిని ప్రభుత్వానికి అమ్మినట్లు సాదాకాయడం చూపించారు.ఇదే విషయంపై కోర్టులో కేసు నడుస్తుందని జూన్లో 7న వాయిదా ఉన్నట్టు వారు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. రైతుల నుంచి గట్టిగా వ్యతిరేకత రావడంతో ఏమి చేయలేని రెవెన్యూ అధికారులు తిరిగి వెళ్లిపోయినట్లు రైతు నాగులపల్లి శ్రీనివాసులు తెలిపారు. మా భూమిని స్వాధీనం చేసుకొని ప్లాట్లు చేసుకొని ప్రభుత్వం అమ్ముకుంటుందని విషయం మాతో చెప్పడం అన్యాయం మనీ వారు ఆరోపించారు.ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు చట్టం ప్రకారం వాస్తవాలను తెలుసుకొని రైతులకు అన్యాయం చేయొద్దని వారు వేడుకున్నారు.