శబ్ద కాలుష్యానికి కారణమైన ద్విచక్ర వాహనాలపై కొరడా..

-12 ద్విచక్ర వాహనాలు సీజ్..
నవతెలంగాణ – సుల్తాన్ బజార్
తీవ్ర శబ్దం చేస్తూ తోటి వాహనదారులను ఇబ్బందులు గురిచేస్తున్న ద్విచక్ర వాహనదారులపై సుల్తాన్ బజార్ ట్రాఫిక్ పోలీసులు కొరడా జూలిపించారు. కోఠి బ్యాంక్ స్ట్రీట్  లో సుల్తాన్ బజార్ ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ రాంబాబు ఆధ్వర్యంలో ఎస్ఐ లు కే సుధాకర్ , సోమశేఖర్ లా బృందం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా విపరీతమైన శబ్ద కాలుష్యాన్ని సృష్టిస్తున్న రాయల్ ఎన్ ఫీల్డ్ వాహనాలపై చాలాన్  లు వేసి వాటి సైలెన్సర్లను తొలగించారు. ఈ సందర్భంగా ఇన్ స్పెక్టర్ రాంబాబు మాట్లాడుతూ.. 12 ద్విచక్ర వాహనాలను గుర్తించి వాహనాలకు ఉన్న సైలెన్సర్లను తొలగించామన్నారు. ఎవరైనా ట్రాఫిక్ నిబంధన ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని వాహనదారులకు హెచ్చరించారు.