మంకీపాక్స్‌ నిర్ధారణ పరీక్షకు డబ్ల్యూహెచ్‌ఓ ఆమోదముద్ర

జెనీవా: అత్యవసర సమయాల్లో ఉపయోగించేందుకై మంకీపాక్స్‌ నిర్ధారణ పరీక్షకు డబ్ల్యుహెచ్‌ఓ ఆమోద ముద్ర వేసింది. అంతర్జాతీయంగా తొలి మంకీపాక్స్‌ నిర్ధారణ పరీక్షను అందుబాటులోకి తీసుకురావడాన్ని కీలకమైన మైలురాయిగా చెప్పుకోవచ్చు. పరిమితమైన పరీక్షా సామర్ధ్యాలు వుండడంతో ఈ వైరస్‌ ఎక్కువగా వున్న ఆఫ్రికా ప్రాంతం తీవ్రంగా ఇబ్బందులు పడుతోంది. అటువంటి సమయంలో ఈ పరీక్ష అందుబాటులోకి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఏడాదిలో ఆఫ్రికా ఖండంలో 30వేలకు పైగా ఎంపాక్స్‌ అనుమానిత కేసులు నమోదయ్యాయి. కాంగో, బురుండి, నైజీరియా దేశాలు బాగా ప్రభావితమయ్యాయి. కానీ కాంగోలో కేవలం 37శాతం కేసుల్లో మాత్రమే ఈ ఏడాది నిర్ధారణ పరీక్షలు చేశారు. తాజా చర్యతో మంకీపాక్స్‌ వైరస్‌ ఉధృతంగా వున్న దేశాల్లో నిర్ధారణ పరీక్షల సామర్ధ్యం పెరగనుంది.