– ట్యాంక్ నిండి పారుతున్న వైనం..
నవతెలంగాణ – చిన్నకోడూరు
ప్రజా సమస్యలను పట్టించుకునేది ఏవరు అనే ప్రశ్న చిన్నకోడూరు మండల ప్రజల్లో ఉత్పన్నమవుతోంది. మండలంలోని మెట్టుబండల వద్ద నిర్మించిన వాటర్ ట్యాంక్ తీరును చూస్తే సమస్యలను పట్టించుకునేవారు కరువయ్యారనే సందేహం స్పష్టమవుతోంది. ఆదివారం కావడంతో వాటర్ ట్యాంక్ పూర్తి స్థాయి పరిమాణంలో నిండిపోయి త్రాగునీరు వృథాగా రోడ్డు వెంట పారి రోడ్డు జలమయమైన సంబంధిత అధికారులు, ఉద్యోగులు అటు వైపు దృష్టి సారించడం లేదు. ట్యాంక్ నిండిపోయిన నీరు నేలపై పారుతూ బురదమవుతున్న వైనంపై చూపరులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సంబదిత అధికారులైన ప్రత్యేక చోరవ చూపి నీరు వృథాను అరికట్టాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.