ఫ్లాష్‌ బ్యాక్‌ లేనిది ఎవరికి?

Who doesn't have a flashback?‘యజ్ఞం, పిల్లా నువ్వు లేని జీవితం’ లాంటి బ్లాక్‌బస్టర్‌ మూవీస్‌ని అందించిన డైరెక్టర్‌ ఏఎస్‌ రవికుమార్‌ చౌదరి తన నెక్స్ట్‌ ప్రాజెక్ట్‌గా ఓ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ చేస్తున్నారు. ఎఎస్‌ రిగ్వేద చౌదరి సమర్పణలో ఆద్య ఆర్ట్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌ పై కార్తీక్‌ రెడ్డి రాకాసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘ఫ్లాష్‌ బ్యాక్‌’ అనే ఇంట్రెస్టింగ్‌ టైటిల్‌ని ఖరారు చేశారు. ‘లేనిది ఎవరికి?’ అనే క్యాప్షన్‌ క్యురియాసిటీని క్రియేట్‌ చేసింది. ‘దర్శకుడు రవికుమార్‌ చౌదరి సినిమాల్లో వినోదానికి, యాక్షన్‌కి కొదవే ఉండదు. దీంతోపాటు ఈ సినిమాకి పెట్టిన టైటిల్‌ సరికొత్తగా ఉండటంతో దీనిపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సరికొత్త కాంబినేషన్‌లో ఈ చిత్రాన్ని తనదైన శైలిలో ఆయన ప్రజెంట్‌ చేయనున్నారు’ అని చిత్ర బృందం తెలిపింది. న్యూ ఏజ్‌ స్టోరీతో రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, ఇతర వివరాలని మేకర్స్‌ త్వరలో తెలియజేస్తారు. ఈ చిత్రానికి మ్యూజిక్‌: జెబి, డీవోపీ: ప్రభాకర్‌ రెడ్డి, లిరిక్స్‌: సుద్దాల అశోక్‌ తేజ, వరంగల్‌ శ్రీను, ఫైట్స్‌: వెంకట్‌, రైటర్‌: డైమండ్‌ రత్నం బాబు.