ఆ అపరిచిత వ్యక్తి ఎవరు?

Who is that stranger?సరికొత్త కంటెంట్‌ను ఎప్పటికప్పుడు ఓటీటీ లవర్స్‌కు అందిస్తోన్న డిస్నీ ఫ్లస్‌ హాట్‌ స్టార్‌ ‘హరికథ’ అనే మరో కొత్త వెబ్‌ సిరీస్‌ను తీసుకొస్తోంది. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌ పై మ్యాగీ దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించారు. దివి, పూజిత పొన్నాడ, రాజేంద్రప్రసాద్‌, శ్రీరామ్‌, మౌనిక రెడ్డి, అర్జున్‌ అంబటి, రుచిర సాధినేని, శ్రియా కొట్టం, ఉషా శ్రీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. డిసెంబర్‌ 13 నుంచి ఈ వెబ్‌ సిరీస్‌ స్ట్రీమింగ్‌కు రాబోతోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఈ సిరీస్‌ ట్రైలర్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు.
ధర్మం నశించి, అధర్మం పెరిగినప్పుడు తాను మళ్లీ పుడతానని, ధర్మాన్ని స్థాపిస్తానని శ్రీకష్ణుడు భగవద్గీతలో చెప్పినట్లు.. పరశురాముడు, నరసింహుడు, వామనమూర్తి.. ఇలా శ్రీవిష్ణు అవతారాల రూపంలో ఊరిలో నేరస్తులను శిక్షిస్తుంటాడో అపరిచిత వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరు?, ఈ హత్యలు ఎందుకు చేస్తున్నాడు? అనే కోణంలో పోలీసుల ఇన్వెస్టిగేషన్‌ మొదలవుతుంది. ఈ విచారణలో పోలీస్‌ ఆఫీసర్‌కు ఎదురైన ఘటనలు ఏంటి అనేది ఆసక్తికరంగా చూపించారు. నాటకాల్లో దేవుడి పాత్రలు పోషించే నటుడిగా రాజేంద్రప్రసాద్‌ కనిపించగా..పోలీస్‌ ఆఫీసర్‌గా శ్రీరామ్‌ నటించారు. మైథాలజీ టచ్‌తో ఇన్వెస్టిగేటివ్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌గా సాగిన ఈ ట్రైలర్‌ అందర్నీ విశేషంగా ఆకట్టుకుంటోంది అని మేకర్స్‌ తెలిపారు.