ఆ.. సూపర్‌ హ్యూమన్‌ ఎవరు?

That's super Human whoసత్యరాజ్‌, వసంత్‌ రవి ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్న సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘వెపన్‌’. మిలియన్‌ స్టూడియో బ్యానర్‌ పై గుహన్‌ సెన్నియప్పన్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా టీజర్‌ను మేకర్స్‌ రీసెంట్‌గా విడుదల చేశారు. ‘యాక్షన్‌ ప్యాక్డ్‌ ఇన్టెన్స్‌ థ్రిల్లర్‌లో సత్యరాజ్‌, వసంత్‌ రవి పాత్రలను నెక్ట్స్‌రేంజ్‌లో రూపొందించినట్లు టీజర్‌ చూస్తే స్పష్టమవుతుంది. సత్యరాజ్‌, వసంత్‌ రవిలపై చిత్రీకరించిన యాక్షన్‌ సన్నివేశాలు కూడా ఆకట్టుకుంటు న్నాయి. ఇక నటన పరంగా ఇటు సత్యరాజ్‌, అటు వసంత్‌ రవి తమదైన విలక్షణతను చాటుకునేలా పెర్ఫామెన్స్‌ ఇరగదీశారు. ప్రభు రాఘవ్‌ సినిమాటో గ్రఫీ, గిబ్రాన్‌ నేపథ్య సంగీతం సినిమాకు హైలైట్‌గా నిలుస్తున్నాయి.
సూపర్‌ హ్యూమన్‌ గురించి అన్వేషణ జరుగు తుంటుంది. అసలా సూపర్‌ హ్యుమన్‌ ఎవరు సత్యరాజా? వసంత్‌ రవినా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిం దేననే క్యూరియాసిటీ కలుగుతుంది. సినిమా ట్రైలర్‌, ఇతర వివరాలను త్వరలోనే తెలియజేస్తామని మేకర్స్‌ తెలియజేశారు. ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్‌ చేయటానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.
రాజీవ్‌ మీనన్‌, తాన్యా హోప్‌, రాజీవ్‌ పిళ్లై, యషికా ఆనంద్‌, మైమ్‌ గోపి, కణిత, గజరాజ్‌, సయ్యద్‌ సుభాన్‌, భరద్వాజ్‌ రంగన్‌ తదితరులు నటిస్తున్నారు.