అశ్వారావుపేట ఎమ్మెల్యే ఎవరు.?

– ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కాంగ్రెస్ కార్యాలయం మా?
– బీఆర్ఎస్ హయాంలో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు..
– అదే రోజు అమరవీరుల కుటుంబసభ్యులను అవమానించిన కాంగ్రెస్..
– ఆర్థిక సహాయం అందించి వారితో కలిసి భోజనం చేసిన కెసిఅర్…
– విలేకర్ల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు
నవతెలంగాణ – అశ్వారావుపేట
శాసన సభ్యుని అధికారిక నివాసం అయిన ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పార్టీ నాయకుడు జాతీయ పతాకాన్ని ఎగురవేయడం ఆశ్చర్యంగా ఉందని,ఈ సంఘటనతో అశ్వారావుపేట ఎమ్మెల్యే ఎవరనేది అంశం పై నియోజక వర్గం ప్రజల్లో అయోమయం నెలకొందని ఆవేదన వ్యక్తం చేసారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలలో భాగంగా మంగళవారం నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లోని మూడు రోడ్ల ప్రధాన కూడలి లోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి, అమర వీరులను స్మరించుకున్నారు.
అనంతరం సామాజిక ఆరోగ్య కేంద్రంలోని ఇన్ పేషెంట్ లకు పండ్లు,బ్రెడ్ లను స్థానిక నాయకులతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఇబ్బందులు ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఉద్యమాన్ని ముందుండి నడిపి ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్రాన్ని కెసిఅర్ సాధించారని,సాధించిన తెలంగాణలో 10 ఏండ్లు పాట్లు అద్భుతంగా పరిపాలించు కున్నాము అనీ, ఎంతో అభివృద్ధి చేసుకున్నామని,తెలంగాణ వచ్చాక కెసిఅర్ మన అశ్వారావుపేట కి వందల కోట్ల నిధులు కేటాయించి అభివృద్ధి చేశారని అన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల,100 పడకల ఆసుపత్రి,డయాలసిస్ సెంటర్,ఆర్టీవో  కార్యాలయం,కోర్టు,సెంట్రల్ లైటింగ్,ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగిందని అన్నారు.అలాగే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను టీఆర్ఎస్ ప్రభుత్వ హయాం లో ఎంతో ఘనంగా పండగలా నిర్వహించామని,కానీ అమలు కానీ హామీలతో  అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం నామ మాత్రంగా వేడుకలు నిర్వహించి చేతులు దులుపుకున్నారు అని అన్నారు.
అంతే కాకుండా తెలంగాణ ఆవిర్భావం రోజైన ఆదివారం నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమరవీరుల కుటుంబసభ్యులను పిలిపించుకొని వారిని ఒక మూల కూర్చోబెట్టి కనీసం గుర్తు చేయలేదని అమరవీరుల కుటుంబసభ్యులు ను అవమాన పరిచారు అని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.కానీ అదే రోజు మాజీ ముఖ్యమంత్రి కెసిఅర్ అమరవీరుల కుటుంబసభ్యులకు రూ.24 లక్షలు ఆర్థిక సహాయం అందజేసి వారితో సహపంక్తి భోజనం చేసారు అని,నిజమైన ప్రేమ ఎవరిదో ప్రజలే గమనించాలని విజ్ఞప్తి చేసారు. జీవితాలు మార్చు తాడు అనుకొని ఓట్లు వేస్తే ఆయన తెలంగాణ తల్లి విగ్రహాలను,గుర్తులను,మార్చుకుంటూ కూర్చున్నారని ప్రజలే  అంటున్నారని వ్యాఖ్యానించారు.
ఎమ్మెల్యే అధికారిక నివాసం ప్రభుత్వానిదా  లేక కాంగ్రెస్ పార్టీ దా? 
ప్రభుత్వానికి సంబంధించిన కార్యాలయంలో పార్టి వ్యక్తులు ఎలా జెండా ఆవిష్కరణ చేసారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి జల్లిపల్లి శ్రీరామమూర్తి,జిల్లా అధికార ప్రతినిధి యూఎస్ ప్రకాష్ రావు, డాక్టర్ ప్రసాద్,టౌన్ ప్రెసిడెంట్ సత్యవరుపు సంపూర్ణ,దిశ కమిటీ సభ్యులు నారం రాజశేఖర్,మండల నాయకులు మందపాటి మోహన్ రెడ్డి,జుజ్జూరపు శ్రీరామమూర్తి గుడవర్తి వెంకటేశ్వర రావు,చిప్పనపల్లి బజారయ్య,శ్రీను,కలపాల దుర్గయ్య,మోటూరి.మోహన్,తాళం సూరి, గోవింద్,బుజ్జిబాబు,కలపాల.సురేష్,తగరం‌ హరికృష్ణ,నరదల దుర్గారావు,రాంబాబు,మురళీ,చరణ్,నక్కా.రాంబాబు,తూంపాటి.రమేష్ తదితరులు పాల్గొన్నారు.