పోలీసుల వేట ఎవరి కోసం?

పోలీసుల వేట ఎవరి కోసం?హీరో విజయ్ ఆంటోని నటిస్తున్న లేటెస్ట్‌ మూవీ ‘తుఫాన్‌’. ఈ సినిమాను ఇన్ఫినిటీ ఫిల్మ్‌ వెంచర్స్‌ బ్యానర్‌ పై కమల్‌ బోరా, డి.లలితా, బి.ప్రదీప్‌, పంకజ్‌ బోరా నిర్మిస్తున్నారు. పొయెటిక్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ జోనర్‌లో ఈ సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు విజరు మిల్టన్‌. ఈ సినిమాను జూలైలో గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌కు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో శనివారం చిత్ర ట్రైలర్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు.
‘ఎవరి గతంలో లేని, మరొకరి భవితగా మారిన ఓ వ్యక్తి కథ ఇదని ట్రైలర్‌లో చెప్పారు. తనకు ఎవరూ తెలియని ఓ ప్రాంతంలోకి వెళ్లి ఎవరూ తనను గుర్తుపట్టకుండా జాగ్రత్తపడుతుంటాడు హీరో విజరు ఆంటోని. అతన్ని తన చీఫ్‌ శరత్‌ కుమార్‌ గైడ్‌ చేస్తుంటాడు. హీరోను ఓ కుటుంబం ఆదరిస్తుంది. మరోవైపు పోలీస్‌ అధికారి మురళీ శర్మ…హీరో కోసం వేట సాగిస్తుంటాడు. ఇంతకీ ఎవరి గతంలోలేని హీరో గతమేంటి? అతని కోసం పోలీసుల వేట ఎందుకు సాగుతోంది?, కొత్త ప్రాంతంలో తనను ఆదరించిన కుటుంబం కోసం హీరో ఏం చేశాడు అనేది ట్రైలర్‌లో ఇంట్రెస్టింగ్‌గా చూపించారు. సినిమాటోగ్రఫీ, బ్యూటిఫుల్‌ లొకేషన్స్‌, పవర్‌ ఫుల్‌ యాక్షన్‌ సీక్వెన్సులు, విజరు ఆంటోనీ ఇంటెన్స్‌, ఎమోషనల్‌ పర్‌ఫార్మెన్స్‌ ఆకట్టుకుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పాటలకు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ట్రైలర్‌ కూడా ఇన్‌స్టంట్‌గా ఆడియెన్స్‌కు రీచ్‌ అయ్యేలా ఆసక్తికరంగా ఉంది అని చిత్ర యూనిట్‌ తెలిపింది.