ఎవరిపై మీ యుద్ధం?

Who is your war on?”మిమ్మల్ని మించిన వీరుల పేర్లే మా వైపున్నాయి మా వాళ్ళు ఆయుధాలు ఉపయోగించడంలో దిట్టలు మా కవచాలు గట్టివి, మా యుద్ధమే ప్రసిద్ధమైనది ఎందుకంటే మా గుండెల నిండా పవిత్రత నిండి యున్నదం”టాడు కింగ్‌ హెన్రీ- ఫోర్‌లో షేక్స్‌పియర్‌ సింఘు, టిక్రీ, ఘాజీపూర్‌లు కార్గిల్‌లు కావు. గొల్వాన్‌ హైట్స్‌ అంతకంటే కావు. వచ్చేది పాకిస్థాన్‌, చైనా సైన్యం కాదు. వస్తున్నది కాంక్రీట్‌ జంగిల్‌ లాంటి దేశ రాజధానిలోకి. గోధుమలైనా, వరిధాన్యమైనా, తృణ ధాన్యాలైనా, పాలయినా ఢిల్లీలోకి పంజాబ్‌, హర్యానా, యూపిల నుండి వచ్చే ప్రవేశద్వారాలవే. పాకిస్థాన్‌ బోర్డర్లో ట్రెంచీలు తవ్వినట్లు, బారి కేడ్లు కట్టినట్టు, ముళ్ళబాట పరిచి నట్టు మోడీ సర్కార్‌ సన్నాహాలు చూస్తే ఆశ్చర్యమేస్తుంది. సరిహద్దులు మూసేయడమే కాదు, హర్యానాలో ఏడు జిల్లాల్లో ఇంటర్నెట్‌ ఆపేశారు. డజన్లకొద్దీ ట్విట్టర్‌ (ఇప్పుడు ఎక్స్‌) అకౌంట్లు బంద్‌ చేశారు. బల్క్‌ మెసేజులు నిషేధించారు.
మనందరికి తిండిపెట్టే అన్నదాతలపై యుద్ధం ప్రక టించింది మోడీ సర్కార్‌. వాస్తవానికి సంయుక్త కిసాన్‌ మోర్చా పిలుపు ఫిబ్రవరి 16న దేశవ్యాపిత గ్రామీణ బంద్‌. దాంతో అనుసంధానిస్తూ దేశవ్యాపిత కార్మిక సమ్మెకు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. దీనికి దేశ వ్యాపిత సన్నాహాలు జరుగుతున్నాయి. ఈలోపు కొన్ని సంఘాలు చలో ఢిల్లీకి పిలుపునిచ్చాయి. దానిపై మోడీ స ర్కార్‌ ఉక్కుపాదం మోపుతున్నది. పైగా ‘మోడీ 3.0’ పాల నకోసం అటు దేశ, విదేశ పెట్టుబడిదారులు అర్రులు జాస్తు న్న నేపథ్యంలో ఈ ‘రైతు ఉద్యమం 2.0’ మళ్ళీ రాజుకుం టుంటే రోడ్లపై మేకులు పరవడం మొదలు డ్రోన్లతో ప్రస్తుతానికి ఏడిపించే గ్యాస్‌తోనే దాడి చేయడం వరకు మోడీ సర్కార్‌ యుద్ధం సాగిస్తోంది.
మన దేశంలో మౌలిక మార్పు వచ్చేవరకు సాగాల్సిన మహాపోరా టంలో నేటి యుద్ధం ఒక దశ. హర్షణీయమైన అంశమేమంటే సంపద సృష్టి కర్తలైన కార్మికులు, కర్షకులు, జాయింట్‌ ఫ్లాట్‌ఫార్మ్‌ ఆఫ్‌ ట్రేడ్‌ యూనియన్స్‌తో సంయుక్త కిసాన్‌ మోర్చా ఒకరికొకరు మద్దతుగా రంగంలోకి దిగడం. అడుగులు నెమ్మదిగానైనా దృఢంగా పడటం! గత నవంబర్‌ చివర్లో జరిగిన ‘మహాధర్నా’కి కొనసాగింపుగా జిల్లాల్లో జరిగిన మోహరింపులు, రేపు 16న దేశవ్యాపిత సమ్మెకు వెన్నుదన్నుగా గ్రామీణ బంద్‌ నిలువనుంది.
ఐదు వందలకి పైగా రైతు సంఘాలతో కూడింది సంయుక్త కిసాన్‌ మోర్చా. మోడీ భజనల్లో మైమరిచి నృత్యం చేసే బీఎంఎస్‌ తప్ప మిగిలిన కార్మిక సంఘాలన్నింటితో కూడింది జాయింట్‌ ఫ్లాట్‌ఫార్మ్‌ ఆఫ్‌ ట్రేడ్‌ యూనియన్స్‌. అనేక రాష్ట్రాల్లో పాలక ప్రాంతీయ, జాతీయ పార్టీలు రంగంలోకి దిగాయి. త్రిపుర, బెంగాల్‌ వంటి రాష్ట్రాల్లో ప్రాణా లకి తెగించి గ్రామీణ బంద్‌ను, జాతీయ పారిశ్రామిక సమ్మెను జయప్రదం చేసేం దుకు వ్యక్తులు, శక్తులు, సంఘాలు ప్రయత్నిస్తున్నాయి. దేశాన్ని మతం ఆధారంగా పోలరైజ్‌ చేసేందుకు కృత నిశ్చయంతో ఉంది మోడీ ప్రభుత్వం. అందుకే, ఎన్నికల్లోపే సి.ఎ.ఎ. ను అమలు చేస్తానం టాడు అమిత్‌షా. మతతత్వ శక్తుల్తో కార్పొరేట్‌ శక్తులు కలగలిసిన నేపథ్యం నేడు మనముందుంది. అయోధ్య రామమందిర నిర్మాణానికి కన్సల్టెంట్లు ‘టాటా’లు కాగా, నిర్మాణ కాంట్రాక్టు ఎల్‌ అండ్‌ టి ది. పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా రైళ్లలో అయోధ్య తీసికెళ్లడానికి ప్లాన్‌ చేశారు. అయోధ్య నుండి అక్షింతల్ని దేశంలోని అత్యధిక ఇళ్లకు పంపిణీ చేశారు. ఇవన్నీ కలిసి మెజారిటీ ప్రజల మనసుల్ని జయిస్తాయని తమ ప్రభుత్వాన్ని బయటేస్తాయని మోడీ భావన.
ముఖ్యంగా కార్మికుల్లోను, ఇరత కష్ట జీవుల్లోనూ నిర్దిష్ట రాజ కీయ క్యాంపెయిన్‌ జరగాలి. 2023 ఒక్క ఏడాదిలోనే రూ. 2.14 లక్షల కోట్లు, మోడీ పాలనా కాలంలో రూ. 15.32 లక్షల కోట్లు పారుబాకీలు ఎందుకు రద్దు చేశారో, డిఆర్‌డిఓను దాదాపు పడావు పెట్టే స్థితి ఎందుకొచ్చిందో, ప్రభుత్వ ఆరోగ్య రంగాన్ని ఎందుకు ప్రయివేటు వారి చేతుల్లో పెడ్తున్నారో, అమెరికాలో లాగా ఇన్సూ రెన్స్‌ ఆధారిత వైద్యసేవల మోడల్‌గా ఎందుకు చేస్తున్నారో, విద్యు త్‌ ప్రయివేటీకరణకు ఎందుకు ముందుకు సాగుతున్నారో వంటి అంశాలన్నింటిని ఈ పోరాట సందర్భంగా చర్చనీయాంశం చేయాలి.
ఎంత నిర్బంధం ఉన్నా రైతాంగం అంతే తీవ్రంగా కదల డానికి కారణం కనీస మద్దతు ధర సాధించుకోడానికే. విద్యుత్‌ ప్రయివేటీకరణ ఆగకుంటే రైతాంగమే కాదు, సామాన్యజనం తీవ్ర ఇబ్బందులు పడతారు. అందుకే నేడు రైతాంగం, కార్మికులు చేస్తున్న పోరాటం దేశం కోసం, దేశాభివృద్ధి కోసం. మన వ్యవ సాయాన్ని పరిశ్రమలను కబ్జా జేసేందుకు ప్రయత్నిస్తున్న దేశ, విదేశ పెట్టు బడిదార్లకు వ్యతిరేకంగా. మోడీ సర్కార్‌ నిలబడ్తున్నదే వారి ప్రయోజనాల కోసం.రానున్న ఎన్నికల్లో మోడీ సర్కార్‌ను సాగనంపితేనే దేశం బాగు పడుతుంది.