ఎందుకు సరిగ్గా ఆలోచించలేకపోయారు?

– మీరే చెప్పాలి :మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తనకు ఓటు వేయని 80 వేల మంది (సంగారెడ్డి నియోజకవర్గం) ఓటర్లు పునరాలోచించుకోవాలని సంగారెడ్డి నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన టి.జగ్గారెడ్డి కోరారు. సోమవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. తాను సంగారెడ్డి నియోజకవర్గం అభివద్ధికి, అక్కడి ప్రజల సంక్షేమం, సంతోషం కోసం ఎంతో చేశానని గుర్తుచేశారు. 70 వేల మంది ఓటర్లు నిరంతరం తనకు ఓటు వేస్తున్నారనీ, మిగిలిన వారు ఎందుకు సరిగ్గా ఆలోచించలేకపోయారో…? అని ప్రశ్నించారు. తనకు ఓటు వేసిన 70 వేల మందికి జవాబుదారీగా ఉంటాననీ, అలా అని ఎవరిపైనా తనకు కోపం లేదని స్పష్టం చేశారు.