తప్పు చేయకుంటే రాజ్‌ పాకాల పారిపోవడమెందుకు?

– ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఏ తప్పు చేయకుంటే కేటీఆర్‌ బావమరిది రాజ్‌ పాకాల ఎందుకు పారిపోయారని ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్‌ రెడ్డి ప్రశ్నించారు. సోమవారం హైదరాబాద్‌లోని సీఎల్పీ మీడియా పాయింట్‌ వద్ద ఆయన మాట్లాడారు. మంత్రిగా చేసిన కేటీఆర్‌ చట్టాలు తెలియకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. వేడుకలో మద్యం సర్వ్‌ చేసేందుకు అనుమతి ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. రేవ్‌ పార్టీ అని ఏ అధికారి చెప్పలేదని స్పష్టం చేశారు. ఇందులో సీఎం రేవంత్‌ రెడ్డి ప్రమేయం ఎలా ఉంటుందని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ స్కాంలు ఒక్కొక్కటిగా బయటికి వస్తుండంతో ఆందోళనతో దృష్టి మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.