మా గ్రామానికి ఎందుకొచ్చావ్‌..?

– అంటూ ఎమ్మెల్యే ‘చల్లా’ను నిలదీసిన మహిళలు
నవతెలంగాణ- ఆత్మకూర్‌
హన్మకొండ జిల్లా ఆత్మకూర్‌ మండలంలో ఆదివారం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు వచ్చిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి భంగపాటు కలిగింది. తమ గ్రామంలోని దళితులకు దళితబంధు, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు ఇవ్వని ఎమ్మెల్యే.. తమ గ్రామానికి ఎందుకు వచ్చినట్టని దళిత మహిళలు ఎమ్మెల్యేను నిలదీశారు. ఉన్న వాళ్లకే అన్ని ఇస్తూ పేద వాళ్ళకు అన్యాయం చేస్తున్నావంటూ మహిళలు ఆరోపించారు. దాంతో అక్కడి నుంచి ఎమ్మెల్యే ద్విచక్ర వాహనంపై వెనుదిరగడంతో.. మహిళలు ఆయన్ని వెంబడిం చారు. కాగా, భారీ పోలీసు బందోబస్తు మధ్య శంకుస్థాపన పనులు చేసి వెనుతిరిగారు. మీకు దళిత బంధు, డబుల్‌ ఇండ్లు ఇస్తానని ఎమ్మెల్యే ఒకవైపు చెబుతున్నా.. ఇంకెప్పుడిస్తారంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.