ఆకాశాన్నంటిన ధరలొక వైపు
అదుపులేని నిరుద్యోగమొక వైపు
అవినీతి.. బంధుప్రీతి
అలుముకున్న సమాజమొక వైపు
ఎందుకొచ్చిన స్వాతంత్ర్యం
ఎవరికొచ్చిన స్వాతంత్ర్యం
పదవీవ్యామోహాలు..కుల,మత,భాషా ద్వేషాలు.. దిగజారుతున్న మానవీయ విలువలు..
ఎందుకొచ్చిన స్వాతంత్ర్యం
ఎవరికొచ్చిన స్వాతంత్ర్యం
ఆటలకు రాని స్వాతంత్ర్యం
పాటలకు లేని స్వాతంత్ర్యం
కర్షకులకు రాని స్వాతంత్ర్యం
కార్మికులకు లేని స్వాతంత్ర్యం
ప్రశ్నించే గొంతుకు
రాని స్వాతంత్ర్యం
పడతులకు లేని స్వాతంత్ర్యం
సంపదను కొల్లగొడుతు
ప్రజలను చీలుస్తున్న ఏలికలకొచ్చిన స్వాతంత్ర్యం
యువత భవితవ్యాన్ని శాషిస్తున్న పాలకులకొచ్చిన స్వాతంత్ర్యం
కాంచవోయి నేటి పరిస్థితి…
మార్చవోయి ఈ పరిస్థితి..
– ఈసరి భాగ్యం