– అసలు పెద్దపల్లికి ఎంపి ఉన్నారా?
– ఉంటే ఎంపి ల్యాడ్స్ నిధులతో అభివృద్ది పై శ్వేత పత్రం విడుదల చేయాలి
– 18వ లోక్ సభ జరగబోయే ఎన్నికలలో స్థనికేతరులు కాకుండా, స్థానికులకు వివిధ రాజకీయ పార్టీలు ఎంపి టికెట్ కేటాయించాలి
– ఉత్తర తెలంగాణ మాల మహానాడు అధ్యక్షుడు పీక కిరణ్
నవ తెలంగాణ మల్హర్ రావు.
రాష్ట్రంలోని లోక్‌సభ సభ్యుల (ఎంపీ)కు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ‘ఎంపీలాడ్స్’ నిధులు త్వరితగతిన వినియోగించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయని ఎంపీలు ఎప్పటికప్పుడు వీటిని వినియోగించుకోలేపోతున్నారని, ఉత్తర తెలంగాణ మాల మహానాడు అధ్యక్షుడు పీక కిరణ్ ఆరోపించారు.ఈ సందర్భంగా మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు కరోనా కారణంగా గత ఏడాది ఏప్రిల్‌లో ఈ పథకాన్ని నిలిపివేసిన కేంద్రం, 2021-22 ఆర్థిక సంవత్సరంలో మిగిలిన కాలం నుంచి 2025-26 వరకు పథకాన్ని కొనసాగించాలని గతంలోనే నిర్ణయించిందన్నారు.అయితే రాష్ట్రం నుంచి 17వ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న 17 మంది ఎంపీలు తమకు వచ్చిన తొలి ఏడాది నిధులనే పూర్తిగా వినియోగించుకోకపోవడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం 1993 నుంచి ‘మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవల్‌పమెంట్ స్కీమ్ (ఎంపీలాడ్స్)’ను అమలు చేస్తోందని, దీని కింద ప్రతి ఎంపీ ఏడాదికి రూ.5 కోట్ల విలువైన పనులను సిఫారసు చేయవచ్చు. అంటే ఒక్కో లోక్‌సభ సభ్యుడు ఐదేళ్లలో రూ.25 కోట్ల విలువైన పనులకు సిఫారసు చేయవచ్చన్నారు. రాష్ట్రంలోని 17 మంది ఎంపీలకు ఏడాదికి రూ.85 కోట్లు మంజూరవుతాయని,ఐదేళ్లలో రూ.425 కోట్లు వస్తాయన్నారు. ఈ నిధులతో సంబంధిత ఎంపీ తన నియోజకవర్గ పరిధిలోనే అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాల్సి ఉంటుంది. సామాజిక ఆస్తులను సృష్టించే అభివృద్ధి పనులను సిఫారసు చేయాల్సి ఉంటుందన్నారు.ఎడతెగని జాప్యంతో నిజానికి కొంతమంది ఎంపీలు సాధ్యమైనంత మేర అభివృద్ధి పనులకు సిఫారసు చేస్తున్నాకానీ, నిర్లక్ష్యం కారణంగా నిధుల వినియోగంలో పెద్ద తేడా కనిపిస్తోందని పనుల అంచనాలు, అనుమతులు, టెండర్లు, ప్రొసీడింగ్స్ వంటివి ఆటంకాలుగా పరిణమిస్తున్నాయి. దీనికి సింగిల్ విండో విధానమంటూ లేకపోవడంతో కార్యాలయాల్లో ఫైళ్లు, క్షేత్ర స్థాయిలో పనులు వేగంగా కదలడం లేదన్నారు. నోడల్ డిపార్ట్‌మెంట్లుగా వ్యవహరిస్తున్న కలెక్టరేట్లు పెద్దగా శ్రద్ధ పెట్టడం లేదని ఎంపీలూ ఎప్పటికప్పుడు సమీక్షించడం లేదన్నారు. ఎంపీల కోటా కింద ఏటా రూ.5 కోట్లు బ్యాంకు ఖాతాల్లో పడిపోతాయని, ఎంపీల నుంచి ఫలానా పనికి సిఫారసు రాగానే దాని అంచనాలు తయారు చేయాలంటూ సంబంధిత శాఖలను కలెక్టరేట్ ఆదేశిస్తుందన్నారు.వారు అంచనాలు రూపొందించి కలెక్టరేట్‌కు పంపిస్తారని, మళ్లీ కలెక్టరేట్ నుంచి ఆ ఫైలు ఎంపీకి వెళుతుందని, అంచనాల మేరకు తన కోటా నుంచి నిధులు తీసుకోవాల్సిందిగా ఎంపీ సిఫారసు చేస్తారు. అది మళ్లీ సంబంధిత మునిసిపాలిటీ, పంచాయతీకి వెళుతుంది. వారు టెండర్లను ఆహ్వానించి పనులను అప్పగిస్తారు. కాంట్రాక్టర్లు సకాలంలో పని పూర్తి చేస్తే సరేసరి. లేదంటే ఏళ్లు గడిచిపోతాయి. ఇన్ని దశలు దాటుకుంటూ పనులు జరగాల్సి ఉన్నందున తీవ్ర జాప్యం జరుగుతోందన్నారు. ఇకా మన పెద్దపల్లి పార్లమెంటు విషయానికి వస్తె అసలు మనకు ఎంపి గారు ఉన్నరా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఉంటే ఏ రోజు కూడా ప్రజల మద్యలోకి రాడని కనీసం పార్లమెంట్ పరిధిలోని సమస్యలు పైన విన్నవిద్దమని ప్రజలు వినుతులునిద్దమన్న అయిన కనపడని పరిస్థితి ఫోను కూడా తీయని వ్యక్తిగా మిగిలిపోయారని, కేవలం వారి ప్రభుత్వం ఉన్నప్పుడు వారు ఎమ్మేల్యేలు మంత్రులు వారి అనుచరుల ఇండ్లకు కేవలం విందు, వినోదాలు, సమావేశాలకు మాత్రమే హాజరు అయ్యేదే తప్ప ప్రజల సమస్యలు ఏరోజు వారికి పట్టలేదని పీక కిరణ్ విమర్శించారు.
లోకల్ ఏరియా డెవల్‌పమెంట్ స్కీమ్ (ఎంపీలాడ్స్)
పథకం కింద జరిగే పనులు స్థానిక ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉంటాయని పథకం ప్రారంభం నుండి, పారిశుద్ధ్య సౌకర్యాల లభ్యత, విద్యుత్, రోడ్లు, తాగునీరు, ప్రజారోగ్యం, పబ్లిక్ లైబ్రరీ, ప్రాథమిక విద్య మరియు ఇతర కమ్యూనిటీ అభివృద్ధి కార్యక్రమాలు మొదలైన అభివృద్ధి పనులుంటయాని మరి ఇలాంటి పనులు ఎక్కడ ఎక్కడ ఖర్చు చేశారో అయిన పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజవర్గలలో ఎంత వరకు అభివృద్ది చేసారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ఇలాంటి ఎంపిని ఇంతవరకు మేము ఎప్పుడు చూడలేదని ప్రజలు అవేదన వ్యక్తం చేస్తున్నారని, ఇలంటి ఎంపికి మరల టికెట్ ఇస్తే అభివృద్ది వెనక్కి పోయినట్టే అని ఆరోపించారు.ఇప్పటికైనా నెలలో జరిగే 18వ లోక్ సభ ఎన్నికలలో భాగంగా పెద్దపల్లి ఎంపి టిక్కెట్ స్థానికేతరులు కాకుండా స్థానికులైన ఎంతమంది మేధావులు యువకులు ప్రజా సంఘాల నాయకులు ఉన్నారని వారికి మాత్రమే టికెట్ కేటాయించాలని, ప్రతిసారీ లోక్ సభ ఎన్నికలలో ఎక్కడివవారినో తీసుకురావడం పార్టీలకు ఆల్వటు గా మారిందని ఈసారైనా స్థానికులకు మాత్రమే ఇవ్వాలని రాజకీయ పార్టీలు ఆలోచన చేయాలని కిరణ్ వివిధ పార్టీలను కోరారు.