హైలెవల్ బ్రిడ్జి పనులపై నాన్చుడు ఎందుకు.?

–  ప్రారంభించే దేప్పుడు.. వర్షాకాలంలోపు పనులు పూర్తయ్యేన..?
– టెండర్ పూర్తయిన ముందుకు సాగడం లేదు.. 
నవతెలంగాణ – డిచ్ పల్లి
గత బిఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరోసారి శంకుస్థాపనలు చక చక చేశారు కానీ నెలలు గడుస్తున్న నేటి వరకు పనులు ముందుకు సాగడం లేదు.ఇందల్ వాయి మండలంలోని వెంగళ్ పాడ్  (పాటించండి) వద్ద ఇందల్ వాయి -బీమ్ గల్ రహదారి మోరగు వాగు పై హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి నిజాంబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ 2 అక్టోబర్ 2023న 5 కోట్ల రూపాయల అంచన వ్యయంతో శంకుస్థాపన చేశారు. దానికి కొద్ది రోజుల తర్వాతనే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో పనులు ప్రారంభించలేదు తీరా అదే హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో పాత  పనులను రద్దు చేసింది.మరోసారి నీదులను తానే మంజూరు చేశానని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి ప్రకటించారు.దానిలో భాగంగానే 19 జనవరి 2024న మరోసారి ఇందల్ వాయి మండలంలో మోరగు వాగు, లింగపుర్ వాగు పై హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపనలు  చేశారు. శంకుస్థాపన చేసి దాదాపు మూడు నెలల కావస్తున్నా ఇప్పటికీ పనులు మొదలు పెట్టాలేదు.అనాడు ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి అదికారులకు వర్షాకాలం లోపు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.దానిలో భాగంగానే మోరగు వాగు టెండర్లు పూర్తయ్యాయి.వార్షాకాలంలోపు హైలెవల్ బ్రిడ్జి పనులు పూర్తి ప్రజలకు అందుబాటులోకి వస్తుందని ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి ప్రకటించారు. దాదాపు టెండర్ ప్రక్రియ కూడా ఈపాటికి పూర్తయిందని, టెండర్ వేసిన కాంట్రాక్టర్  పాత బ్రిడ్జికి అనుకుని కొద్ది దూరంలో నుండి మట్టి రోడ్డు వేసి పైపులు కూడా వేసి నేలలు అవుతున్న నేటి వరకు హై లెవెల్ బ్రిడ్జి పనులు ప్రారంభానికి నోచుకోకపోవడంతో మండల వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే కాకుండా గౌరారం గ్రామపంచాయతీ పరిధిలోని లింగాపూర్ వాగు వద్ద ఏడు కోట్ల రూపాయల అంచన వ్యయంతో ఒకేరోజు రెండు వేర్వేరు చోట్ల హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపనలు రెండు సార్లు  అనాడు బాజిరెడ్డి గోవర్ధన్, నేడు డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి లు శంకుస్థాపనలు చేశారు. లింగాపూర్ వాగు వద్దకు ఇంకా ఎలాంటి పురోగతి నేటి వరకు కనిపించడం లేదు. వర్షాకాలంలో ఇందల్ వాయి నుండి ధర్పల్లి, సిరికొండ, భీంగల్ వైపు రాకపోకలు సాగించే ప్రయాణికులు, ద్విచక్ర వాహనాలు, బస్సులు, లారీలు, టిప్పర్లు,అటో,కర్లు, ట్రాక్టర్ లకు ఏడిచి పైనుంచి వర్షపు నీరు వెళ్లేటప్పుడు కష్ట కష్టాలు పడి ఎక్కడికక్కడ రోజుల తరబడి వేచి ఉండవలసి వస్తుందని వాహన దారులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్రిల్ నేలలో పనులు ప్రారంభిస్తే జూన్ నెల వరకు పూర్తవుతుందని, మండల వాసులు అంటున్నారు.ఈ రాహదరి గుండ ఒక్క ఇందల్ వాయి మండలంలోని పాలు గ్రామాలే కాకుండా, దర్పల్లి, సిరికొండ, భీంగల్ మండలాల నుండి రోజు వందలాది వాహనాలు,వేల సంఖ్యలో ప్రజలు అనునిత్యం రాకపోకలు సాగిస్తు ఉంటారు.రేండు హైలెవల్ బ్రిడ్జిలు పాతవి కావడం తో ఎప్పుడూ ఎం ప్రమాదం చోటు చేసుకుంటుందో నేనే ఆందోళన నేలకోని ఉంది.ఇకనైన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి రెండు చోట్ల హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణా పనులను త్వరితగతిన చేపట్టే విధంగా చొరవ చూపాలని ఆయా గ్రామాలకు చెందిన ప్రజా ప్రతినిధులు,వాహన దారులు కోరుతున్నారు.రేండు చోట్ల బ్రిడ్జి లు అందుబాటులోకి వస్తే వర్షాకాలం లో ఎ సమయంలోనైన తాము రాకపోకలు సాగించు కోవచ్చని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.