మోడీ ప్రభుత్వానికి తెలంగాణ అంటే ఎందుకింత కక్షా..

– బీజేపీ మాత్రం రాష్ట్రానికి చిల్లి గవ్వ ఇవ్వలేదు
– బీజేపీ పార్టీ తెలంగాణ ద్రోహి 
– మాలమహానాడు ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు డాక్టర్ పసుల రాంమూర్తి 
నవతెలంగాణ -తాడ్వాయి 
కేంద్ర ప్రభుత్వానికి, తెలంగాణ ప్రజలు అంటే ఎందుకింత కక్షా అని, బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదని బీజేపీ పార్టీ తెలంగాణ ద్రోహి అని మాల మహానాడు ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు డాక్టర్ పసుల రామ్మూర్తి అన్నారు. బుధవారం మాలమహానాడు ఆఫ్ ఇండియా ముఖ్య నాయకుల సమావేశం ములుగు జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో జిల్లా నాయకులు సాల్లూరి లక్ష్మణ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంనికి ముఖ్య అతిదిగా మాలమహానాడు ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు డాక్టర్ పసుల రాం మూర్తి హాజరు అయి ప్రసంగించారు. తెలంగాణ పై ఎప్పుడు విషం జిమ్ముతున్న మోడీ. మరో సారి మోసం బయట పడింది అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సరిగా జరగలేదు అన్నారు. తల్లి నీ చంపి బిడ్డను బ్రతికించాడు అన్నారు. తలుపులు మూసి రాష్ట్ర ఏర్పాటు చేశారు అన్నారు. బడ్జెట్ లో తెలంగాణ పదమే ఎత్తలేదు.విభజన చట్టం లో ఉన్న హామీ గురించి మాట్లాడలేదు. అని ఆవేదన చెందారు. బీజేపీ మీకు రాష్ట్రం లో నూకలు చెల్లాయి… రానున్న స్థానిక ఎన్నికల్లో బిఆర్ఎస్ కు పట్టిన గతే మీకు పడుతుంది.అని హేంచారిచారు. రాష్ట్రానికి మీరు ఏమి ఇవ్వరు…కానీ మీకు తెలంగాణ లో 8 సీట్లు,ఇచ్చిన దండుగ అయిందాన్నారు.
జాగ్రత్త బీజేపీ…
ఎన్నికల సమయం లో కాంగ్రెస్ పార్టీ పదే పదే మొత్తుంకుంది. మోడీ మన రాష్ట్రానికి గాడిద గుడ్డు ఇచ్చిండు అని…అదే నేడు నిజం అయింది.ఈ కార్యక్రమం లో బండారి చంద్రయ్య, భూపతి జనార్దన్, సాల్లూరి లక్ష్మణ్, బందెల వెంకటేశ్వర్లు, గంగేల్లి విజయ్, బట్టు రఘు, బండారి బుజ్జిబాబు, బందెల సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.