ఆ లేఖలో మహిళా బిల్లు ప్రస్తావన ఎందుకు లేదు?

– సోనియాగాంధీకి ఎమ్మెల్సీ కవిత ప్రశ్న
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో చర్చించేందుకు 9 అంశాలను ప్రతిపాదిస్తూ ప్రధాని నరేంద్ర మోడీకి సోనియాగాంధీ లేఖ రాశారనీ, అందులో మహిళా బిల్లు ప్రస్తావన ఎందుకు చేయలేదని ఎమ్మెల్సీ కల్వకుంట కవిత సోనియాగాంధీని ప్రశ్నించారు. ఇదే అంశంపై బుధవారం ట్వీట్‌ చేశారు. చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశం కాదా? అని అడిగారు. మహిళా బిల్లును కాంగ్రెస్‌పార్టీ పూర్తిగా విస్మరిస్తున్నదని పేర్కొన్నారు.