నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రజల బాధలు పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నదని వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షులు వైఎస్ షర్మిల శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. ప్రతిపక్ష పార్టీల సలహాలు పాటించకుండా..కాలయాపన చేస్తూ..ప్రత్యేక సలహాదారులను నియమించకోవడమేంటని ప్రశ్నించారు. రైతుల సమస్యల గురించి కేసీఆర్‌కు చెవిటోని ముందు శంఖం ఊదినట్టుగా ఉన్నదని పేర్కొన్నారు. సలహాలు తీసుకోనప్పుడు సలహాదారులెందుకని ప్రశ్నించారు.