అర్హుల జాబితా కానప్పుడు ప్రకటించడం ఎందుకు…?

Why advertise when it is not a merit list...?– గందరగోళం మధ్య ముగిసిన గ్రామ సభలు…
– అసంబద్ధ లబ్ధిదారులు ఎంపికపై అధికారులను నిలదీసిన సీపీఐ(ఎం) నాయకులు చిరంజీవి…
నవతెలంగాణ – అశ్వారావుపేట
నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట మండలంలో నిందలు,నిరసనలు,ఆరోపణలు,గందరగోళ పరిస్థితుల నడుమ ప్రజాపాలన గ్రామ సభలు ముగిసాయి. చివరి రోజు అయిన శుక్రవారం నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట, గాండ్లగూడెం, గుమ్మడి వల్లి, కోయ రంగాపురం, తిరుమల కుంట ల్లో గ్రామసభలు జరిగాయి. గుమ్మడవల్లి, అశ్వారావుపేట గ్రామ సభలు తీవ్ర గందరగోళం పరిస్థితులు నెలకొన్నాయి. అర్హుల జాబితా కాదంటూ నే ఎందుకు ప్రకటిస్తున్నారని సీపీఐ(ఎం) జిల్లా నాయకులు చిరంజీవి గ్రామ సభ నిర్వహణ బృందాన్ని నిలదీశారు. ఇందిరమ్మ ఇండ్లు జాబితా చదవగానే అందులో చోటు లభించని పేదలు, ఆశావాహులు ఒక్క సారిగా వేదిక వద్దకు దూసుకొచ్చారు. 35 ఏండ్లుగా పూరి గుడిసెలో ఉంటున్నాను అని ఓ అంధుడు సభావేదిక బల్ల పైకి ఎక్కి తన గోడు చెప్పడానికి ప్రయత్నించాడు. పోలీస్ లు అతన్ని వారించి క్రిందకు దింపేశారు. టీఆర్ఎస్ నాయకులు సంపూర్ణ, జుజ్జూరపు శ్రీరామమూర్తి లబ్ధిదారుల ఎంపిక పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ అధికారులను ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు చెన్నకేశవ రావు పలువురిని సముదాయించి సర్ధి చెప్పడానికి ప్రయత్నం చేసారు. ఈ కార్యక్రమాల్లో పీఏసీఎస్ అద్యక్షులు చిన్నం శెట్టి సత్యనారాయణ, అధికారులు తహశీల్దార్ క్రిష్ణ ప్రసాద్, మండల ప్రత్యేక అధికారి, పశుసంవర్ధక శాఖ అదనపు సంచాలకులు డాక్టర్ ప్రదీప్ కుమార్, ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్, ఎంపీఈవో ప్రసాదరావు, ఈజీఎస్ ఏపీవో కే.రామచంద్రరావు, ఈఓ కోటమర్తి శ్రీరామ మూర్తి, ఏవో శివరాం ప్రసాద్, ఐటీడీఏ డీఈ బాపనయ్య, ఐబీ ఏఈ కేఎన్బీ క్రిష్ణ, కార్యదర్శులు ప్రశాంత్ కుమార్, బాబు, క్రిష్ణ కాంత్, కార్తీక్, కాంగ్రెస్ మండల అద్యక్షులు తుమ్మ రాంబాబు, జూపల్లి రమేష్, ప్రమోద్, మిండ హరిక్రిష్ణ లు పాల్గొన్నారు.