– సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ నిలదీత..
– ఎంపీటీసీ మీనా పేరు 11 కెవి మీనాగా మారింది!
– ఐదేళ్లలో సర్వసభ్య సమావేశంతో ఒక్క సమస్య పరిష్కారం కాలే దని సభ్యుల ఆవేదన!
నవతెలంగాణ – నవీపేట్
మండలంలో రాత్రింబవళ్లు ఇసుక, మొరం దందా జోరుగా జరుగుతున్న రెవెన్యూ అధికారులు ఆపరెందుకని ఎంపీపీ సంగెం శ్రీనివాస్ ఎమ్మార్వో నారాయణను సర్వసభ్య సమావేశంలో ప్రశ్నించారు. రెవెన్యూ అధికారుల కనుసన్నల్లోనే జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయని ఇకనుండయినా దృష్టి సారించాలని కోరారు. తమకు గ్రామాల్లో వీఆర్ఏలు లేని కారణంగా అడ్డుకోలేకపోతున్నామని మైనింగ్ అధికారులకు లేదా 100 నెంబర్ కు సమాచారం ఇస్తే అడ్డుకోవచ్చని ఎమ్మార్వో తెలిపారు. గతంలో మన ఊరు మనబడి పనులు చేపట్టిన ఇప్పటికీ బిల్లులు రాలేదని ఎంఈఓ గణేష్ రావును ఎంపీటీసీ కృష్ణమోహన్ నిలదీశారు. సంవత్సరాల తరబడి బిల్లులు ఇవ్వకపోతే కాంట్రాక్టర్లకు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఇప్పటికైనా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. మన ఊరు మన బడి కార్యక్రమానికి బదులుగా అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమం వచ్చిందని తాము చేసిన పనుల కమిటీ రద్దు చేశారని చెక్ పవర్ ఎవరికి వస్తుందో అయోమయ పరిస్థితిలో కాంట్రాక్టర్లు గందరగోళంలో ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకుముందు నందిగాం నాయకులు దవాడే సంజీవ్ పెండింగ్ లో ఉన్న నలభై లక్షల బిల్లును వెంటనే మంజూరు చేయాలని ఎంపీపీ, ఎంపీడీవోలకు వినతిపత్రం అందించారు.

ఎంపీటీసీ మీనా పేరు 11 కేవీ మీనా గా మారింది!
తాను ఎంపీటీసీగా పదవి బాధ్యతలు చేపట్టి మొట్టమొదటి సమావేశంలో సుభాష్ నగర్ లో గల 11 కెవి విద్యుత్ స్తంభాలు ఇండ్లలో అతి ప్రమాదకరంగా ఉన్నాయని వాటిని తొలగించాలని ఐదేళ్లుగా ప్రతి సర్వసభ్య సమావేశంలో ట్రాన్స్కో అధికారుల దృష్టికి తీసుకువచ్చానని దీంతో తన పేరు ఎంపీటీసీ మీనాగా కాకుండా 11 కెవి మీనాగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. చివరి సమావేశం కావడంతో ఇప్పటికైనా సమస్యను పరిష్కరించాలని కోరారు.తాము ఐదేళ్లలో సర్వ సభ్య సమావేశంలో సభ దృష్టికి తీసుకువచ్చినా ఏ ఒక్క సమస్యను పరిష్కరించడంలో అధికారులు విఫలమయ్యారని ఇప్పటికైనా తాను ఐదేళ్లలో విన్నవించిన సమస్యల జాబితాలా వినతి పత్రాన్ని ఎంపీపీ, ఎంపీడీవోలకు అందించి పరిష్కరించాలని కోరారు. సర్వసభ్య సమావేశంలో ఐదేళ్లలో ఏ ఒక్క సమస్యను పరిష్కరించలేక పోయామని ప్రజలకు తాము ఏమి సమాధానం చెప్పుకోవాలని ఎంపీటీసీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఎంఈఓ గణేష్ రావు నూతన పాఠ్యపుస్తకాలను ఎంపీపీ, ఎంపీడీవో ల ద్వారా అందించారు. అనంతరం ఐకెపి మహిళా సంఘాలతో కుట్టిన విద్యార్థుల యూనిఫామ్ లను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సవిత, వైస్ ఎంపీపీ ఇందూర్ హరీష్, ఎంపీటీసీలు సతీష్, సాయిలు జనార్ధన్ మరియు వివిధ శాఖల మండల అధికారులు పాల్గొన్నారు.