బీసీల కులగణన సర్వేలో బీసీ జనాభా ఎందుకు తగ్గింది

నవతెలంగాణ – ఆర్మూర్
బీసీల కులగణన సర్వేలో బీసీ జనాభా ఎందుకు తగ్గిందని తెలంగాణ బీసీ గ్రాడ్యుయేట్స్ ఫోరం చైర్మన్, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అబ్బగోని అశోక్ గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పట్టణంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 2024 వ సంవత్సరం నాటి జనాభా దామాషా ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం చేయించిన సమగ్ర కుటుంబ సర్వే లెక్కలలో బీసీ జనాభా ఎందుకు తగ్గిందని డిమాండ్ చేశారు. గత పది సంవత్సరాల క్రితం 2014 నుండి 24 వరకు ఉన్నటువంటి లో 8 శాతం ఉంటే ఇప్పుడు 15 శాతానికి ఎలా పెంచారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కులగనన నివేదికలో తప్పుడు లెక్కలు ఉన్నాయని, దీని వలన బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలిపారు. గత ప్రభుత్వం లాగానే ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కులగణలో కేవలం ఈడబ్ల్యూఎస్ ఎస్ రిజర్వేషన్లు కాపాడుకునేందుకు అగ్రవర్ణాల కోసం చేసిన సర్వేల ఉందని, బీసీలను మభ్య పెట్టేందుకు ఈ యొక్క సమగ్ర కులగణన సర్వే పేరుతో బీసీలకు అన్యాయం చేశారని అన్నారు. గత ప్రభుత్వంలో కూడా బీసీలకు అన్యాయం జరగడం వలన కేసీఆర్ ప్రభుత్వాన్ని బీసీలు ఓడించారని, అదే గది ప్రస్తుతము ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా బీసీలు బుద్ధి చెప్తారని అన్నారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గాని, స్థానిక సంస్థలో ఎన్నికల్లో గాని కాంగ్రెస్ కు ఓటమి తప్పదని హెచ్చరించారు. వెంటనే తమ వైఖరిని మార్చుకొని బీసీలకు న్యాయం జరిగే విధంగా చేయకపోతే బీసీ లందరూ రోడ్ల మీదికి వచ్చే పరిస్థితి ఎదురవుతుందని హెచ్చరిక జారీ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు బండి నారాయణ,స్వాతి రాజేశ్వర్, రుద్ర కృష్ణ, ఎల్లోల సురేష్ తదితరులు పాల్గొన్నారు.