తెలంగాణ యూనివర్సిటీ ఈసీ సభ్యుల్లో ఎస్సీ, ఎస్టీ సభ్యులు ఎందుకు ఉండరు..?

– ఎంఎస్ఎఫ్ తెలంగాణ యూనివర్సిటీ
నవతెలంగాణ – డిచ్ పల్లి
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా ఇంకా ఈ దేశంలో ఎస్సీ, ఎస్టీలకు సరైన అవకాశాలు అందడం లేదని, ఒకవేళ గుడ్డిలో మెల్లగా అవకాశాలు అందిన వాటికి కూడా అగ్రకుల కుట్రలతో నిర్వీర్యం చేస్తున్నారని ఎం ఎస్ ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సురేష్ మాదిగ అన్నారు.బుదవారం యూనివర్సిటీ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ యూనివర్సిటీలో ఉన్న ఈసీ సభ్యులు, ప్రస్తుతం యూనివర్సిటీలో జరుగుతున్న సంఘటనలు యూనివర్సిటీ ఈసీ లో సామాజిక న్యాయం లోపించడం వల్లనే యూనివర్సిటీలో ప్రస్తుత సంఘటనలు జరుగుతున్నాయని ఆయన అన్నారు.ఈసీ సభ్యులలో ఎస్సీ, ఎస్టీలు సభ్యులుగా లేకపోతే యూనివర్సిటీలో ఉండే ఎస్సీ, ఎస్టీ ప్రొఫెసర్లు, ఔట్సోర్సింగ్ ఉద్యోగస్తుల, కాంట్రాక్టు ఉద్యోగస్తుల, నాలుగో తరగతి ఉద్యోగస్తుల, విద్యార్థుల సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయని సురేష్ ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ సభ్యులు లేని ఈసీ ప్రజాస్వామికంగా ఉంటుందని మేము అనుకోవట్లేదని, ఎస్సీ, ఎస్టీ సభ్యులు లేని ఈసీ తెలంగాణ యూనివర్సిటీలో ఏ నిర్ణయం తీసుకున్నా అది తెలంగాణ యూనివర్సిటీలోని ఎస్సీ, ఎస్టీలకు వ్యతిరేకంగానే ఉంటాయని పేర్కొన్నారు. అటువంటి ఈసీ నీ ఎంఎస్ఎఫ్ తెలంగాణ యూనివర్సిటీ కమిటీ, రాష్ట్ర కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని తెలిపారు. తెలంగాణ యూనివర్సిటీ ఈసీ లో సామాజిక న్యాయ కోణం లేదు కాబట్టే యూనివర్సిటీలో గత కొన్ని రోజులుగా యూనివర్సిటీ చరిత్ర మసకబారే సంఘటనలు జరుగుతున్నాయని అయన ఆవేదన వ్యక్తం చేశారు.వీటన్నిటికీ రాష్ట్ర ప్రభుత్వం, సాంకేతిక విద్య శాఖ నవీన్ మిట్టల్ భాధ్యత వహించాలనీ డిమాండ్ చేస్తున్నామన్నారు. తెలంగాణ యూనివర్సిటీ ఈసీ సభ్యులలో ముగ్గురు గౌడ కులస్థులు ఎందుకు ఉంటారని ? ఇది ఎలా సామాజిక న్యాయం అవుతుందని ప్రశ్నించారు. ముందు ఈసీ నీ ప్రక్షాళన చేసి, ముగ్గురు గౌడ కులస్తులలో ఇద్దరినీ తీసివేసి ఆ స్థానంలో ఇద్దరు ఎస్సీ, ఎస్టీలకు అవకాశం కల్పించి, ఆ తర్వాత యూనివర్సిటీ వీసీ, రిజిస్ట్రార్ ల గురించి మాట్లాడాలని రాష్ట్ర ఉన్నత విద్య శాఖా, సాంకేతిక విద్య శాఖా లను హెచ్చరిస్తున్నమన్నారు.ఈ కార్యక్రమం లో టీయూ ఎంఎస్ఎఫ్ అధ్యక్షులు బొర్రారపు వెంకట్రమణ, మునేసుల ఉదయ్ మాదిగ, అభినయ్ మాదిగ, సునీల్ మాదిగ, ప్రశాంత్ మాదిగ పాల్గొన్నారు.