
మండల కేంద్రంలోని పదవ వార్డ్ లో కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావును గెలిపించాలని స్థానిక కాంగ్రెస్ శ్రేణులు ఎల్లమ్మ ఆలయంలో సోమవారం పూజలు చేశారు. అనంతరం ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించి చేతి గుర్తుకు ఓటేయ్యాలని ఓట్లు అభ్యర్థించారు.బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు లింగాల శ్రీనివాస్,వర్కింగ్ ప్రెసిడెంట్ అక్కరవేణి పోచయ్య,టౌన్ ప్రెసిడెంట్ బండిపెల్లి రాజు,మాజీ సర్పంచ్ రావుల నర్సయ్య, ప్రధాన కార్యదర్శి తిప్పారపు మల్లేశం,జెల్ల ప్రభాకర్,బండి వేణు,ఐలేని శ్రీనివాస్ రెడ్డి,ఇస్కీల్ల ఐలయ్య,బొనగం రమేష్,రొడ్డ మల్లేశం, బోనగం లక్ష్మీనారాయణ,లింగాల లక్ష్మణ్,బోనగిరి ఎల్లయ్య, ప్రభాకర్,దుర్గయ్య,మల్లయ్య,సురేష్, కార్యకర్తలు పాల్గొన్నారు.