ఏజెన్సీలో మండలాధికారులు విస్తృత పర్యటన

నవతెలంగాణ -తాడ్వాయి
మండలంలోని అటవీ ఏజెన్సీ ప్రాంతాలు బంధాల, బొల్లెపెల్లి, పోచాపూర్ ఆదివాసి గ్రామాలను శనివారం స్థానిక తహసిల్దార్ తోట రవీందర్, మండల ప్రత్యేక అధికారి అల్లెం అప్పయ్య, ఎంపీడీవో సుమన వాణి లు విస్తృతంగా పర్యటించారు. వచ్చే వర్షాకాల సీజన్ లో రవాణా సౌకర్యాలు సరిగా ఉండవు, వర్షాలు బాగా కురిసినప్పుడు వరదలు వచ్చే అవకాశం ఉన్న గ్రామాలను సందర్శించి పరిశీలించారు. బాగోగులను అడిగి తెలుసుకున్నారు. పోచపూర్ వద్ద ఉన్న హై లెవెల్ బిడ్జి, లో లెవెల్ బిడ్జిలను పరిశీలించారు. పోచ్చాపూర్ బ్రిడ్జి వద్ద ముందు, వెనక రోడ్డు మొత్తం లేకుండా ఉన్నందున వర్షాకాలం రహదారి సరిగా ఉండదు. పోచ్చాపూర్ మినీ గురుకులం విద్యార్థులకు చాలా ఇబ్బంది ఉంటుంది. ఈ మరవద్దు విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తామన్నారు. అనంతరం బొల్లెపల్లి ప్రైమరీ స్కూల్లో జరుగుతున్న అమ్మ ఆదర్శ పాఠశాల మరమ్మతులను పరిశీలించారు. నాణ్యత లోపిస్తే కట్టిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అనంతరం కొడిశల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక తాసిల్దార్ తోట రవీందర్, ప్రత్యేక అధికారి జిల్లా వైద్యాధికారి అల్లెం అప్పయ్య, ఎంపీడీవో సుమన వాణి, ఎం పి ఓ శ్రీధర్ రావు, డాక్టర్ పవన్, పంచాయతి సెక్రటరీ రమేష్, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.