బంద్ నేపథ్యంలో పోలీసుల విస్తృత తనిఖీలు

నవతెలంగాణ – గోవిందరావుపేట: మహారాష్ట్ర లోని గడ్చిరోలి ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ కు నిరసనగా మావోయిస్టులు బంద్ పలికిన నేపథ్యంలో పసర పోలీసులు అప్రమత్తమయ్యారు. శనివారం ఎస్ఐ కమలాకర్ అద్వర్యం లో విస్తృత వాహన తనిఖీలు చేపట్టడంతో పాటు జాతీయ రహదారిపై అర్ధరాత్రి పూట ఆకస్మిక తనిఖీ కార్యక్రమం నిర్వహించటం జరిగింది. వాహనాలను ఆపి అందులో ఉన్న వ్యక్తుల వివరాలు ఆడిగితెలుసుకోవటం జరిగింది.అనుమానం వచ్చిన అందరిని ప్రశ్నించిచటం జరిగింది. ఈ సందర్బంగా ఎస్గాఐ కమలాకర్ మాట్లాడుతూ మావోయిస్టులకు సంబంధించిన ఏ చిన్న సమాచారం ఉన్న తమకు తెలియచేయాలని చెప్పారు. మావోయిస్టు లకు సహకరిస్తూ చట్టవ్యతిరేకమైన పనులకు పాల్పడితే చర్యలు తప్పవని చెప్పటం జరిగింది.