– వేదింపులు కేసు నమోదు…
నవతెలంగాణ – అశ్వారావుపేట
భార్యను వేధింపులకు గురి చేస్తున్న భర్త పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం స్థానిక ఎస్ఐ శివరామకృష్ణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని గుర్రాల చెరువు కు చెందిన సాధు ఝాన్సీ కు దమ్మపేట మండలం నాచారం కి చెందిన మహేష్ తో సుమారు 11 ఏళ్ల క్రితం వివాహమైంది.ఈ దంపతులకు ఇద్దరు సంతానం ఉన్నారు. గడిచిన కొంతకాలంగా భార్యను మానసికంగా,శారీరకంగా వేధిస్తున్నాడు.ఈ వేధింపులు భరించలేక వారం రోజుల క్రితం ఝాన్సీ తన పుట్టింటికి వచ్చేసింది.ఈ మేరకు భర్తపై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.