జిల్లాకేంద్రంలోని డిపో గ్యారేజ్ ఆవరణలో మంగళవారం నిర్వహించిన కార్తీక వన భోజన కార్యక్రమం ఆహ్లాదకరమైన వాతావరణంలో సాగింది. ఆర్టీసీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు హాజరుకాగా.. వివిధ రకాల ఆటల పోటీలు ఏర్పాటు చేశారు. వారు ఎంతో ఉల్లాసంగా… ఉత్సాహంగా ఈ పోటీల్లో పాల్గొని ఆటవిడుపుగా గడిపారు. కార్యక్రమ ముఖ్యఅతిథిగా రీజనల్ మేనేజర్ సోలోమన్, డిపో మేనేజర్ కల్పన పాల్గొని వారిని ఉత్సాహపరిచారు. అనంతరం అందరితో కలిసి భోజనాలు చేస్తూ సందడిగా గడిపారు. కార్తీక మాసంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ యేడాది సైతం ఈ వన భోజన కార్యక్రమం ఏర్పాటు చేశామని, ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు తరలిరావడం సంతోషకరంగా అనిపించిందని డిపో మేనేజర్ కల్పన తెలిపారు.