నేతాజీ నగర్ లో వన భోజనాల కార్యక్రమం..

నవతెలంగాణ – గోవిందరావుపేట
మండలం లోని నేతాజీ నగర్ గ్రామంలో ఆదివారం గ్రామ పెద్దలు, మహిళలు పిల్లలు తొలకరి పులకరించడంతో వనభోజనాల కోసం గ్రామస్తులంతా కలిసి మన భోజనాలకు వెళ్లడం జరిగింది. వర్షాలు సమృద్ధిగా పడాలని గొడ్డు గోదా పిల్ల జిల్లా పాడి పశు పచ్చగా ఉండాలని ఆ గ్రామదేవతలైనటువంటి మేరా మా యాడి ని కోలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ ఈ సామూహిక వనభోజనాల కార్యక్రమం వల్ల ఐకమత్యం ఏర్పడుతుందని, గతంలో జరిగిన తగాదాలు గొడవలు అన్ని మరిచిపోయి మరల అందరం ఒకటిగా ఒకే చోట చెట్ల కింద వంటలు చేసుకుని ఒకరి వంట మరొకరు పంచుకుంటూ తింటూ ఒక అనుభూతిని సంతోషాన్ని ఆస్వాదిస్తామని అన్నారు. చుట్టూ పచ్చని చెట్లు పంట పొలాలు ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లలు ఆడుతూ సరదాగా గడుపుతారని అన్నారు.