వన్యప్రాణులపై అవగాహన సదస్సు

నవతెలంగాణ – రామారెడ్డి
మండలంలోని రెడ్డి పేటలో అడవి అధికారుల సమక్షంలో బుధవారం వన్యప్రాణులపై ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ అధికారి శంకర్ మాట్లాడుతూ… వన్యప్రాణులను రక్షించవలసిన బాధ్యత మనందరిపై ఉందని, వన్యప్రాణులను వేటాడిన, వన్యప్రాణుల మాంసాన్ని విక్రయించిన చట్టపరంగా కఠిన చర్యలు తీసుకొని జైలుకు పంపుతామని, అడవిలో చెట్లను నరికిన, ఇసుకను తరలించిన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సెక్షన్ ఆఫీసర్ జయశ్రీ, రామ లీల, శేఖర్ రెడ్డి, శ్రీధర్, సుధీర్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.