
నవతెలంగాణ – మాక్లూర్:
మరో సారి తనకు అవకాశం ఇస్తే మరింత అభివృద్ది చేస్తానని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం మండలంలోని ముల్లంగి(బి), బొంకన్ పల్లి, ఆలుర్ మండలంలోని గుత్ప గ్రామాల్లో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రజా ఆశీర్వాద యాత్రలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రెండు సార్లు ప్రజలు నన్ను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపించారని, గ్రామాల్లో అనేక అభివృద్ది కార్యక్రమాలు చేశానని మళ్ళీ ప్రజలు తనను ఆశీర్వదించి గెలిపిస్తే మరింత అభివృద్ది చేస్తానని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధిని, పథకాలను ప్రజలకు వారి మెని పేస్టో ను వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కనిగంటి పావని, సాయమ్మ, గంట చిన్నయ్య, ఎంపిపి మస్తా ప్రభాకర్, ఎంపిటిసి పూజిత, స్థానిక నాయకులు శ్యామ్ రావు, రంజిత్, అమృత్, అమ్రద్ సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపిటిసిలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.