బడ్జెట్ లో 34 శాతం అప్పులతో వికసిత భారత్ కలనెరవేరుతుందా..?

– డాక్టర్ ఏ . పున్నయ్య విభాగాధిపతి అర్థశాస్త్ర విభాగం ,తెలంగాణ విశ్వవిద్యాలయం..
నవతెలంగాణ-డిచ్ పల్లి : 2024-25 ఆర్థిక సంవత్సరానికి  నిర్మల సీతారామన్  ప్రవేశపెట్టిన  బడ్జెట్ ను సామాన్య ప్రజలు మొదలుకొని వేతనజీవులు   మధ్యతరగతి ప్రజలు ఆసక్తిగా ఎదురుచూసినారు. సామాన్యుల కు,  వేతనజీవులకు ,మధ్యతరగతి కి ప్రయోజనంలేదు. కార్పొరేట్ల  కే  ఈ  బడ్జెట్లో పెద్దపీటవేసినారు. అనేక  ఆశలు, భారీ అంచనాల మధ్య  వికసిత్‌ భారత్‌  లక్ష్యంగా  రూ.48.21 లక్షల కోట్లు గా   ప్రవేశపెట్టిన ఈ  బడ్జెట్లో  మొత్తం ఆదాయం కేవలం  రూ.32.07 లక్షల కోట్లు మాత్రమే   ఇందులో  పన్ను ఆదాయం రూ.28.83 లక్షల కోట్లు కాగా  అప్పులు, పన్నేతర ఆదాయాలు రూ.16 లక్షల కోట్లుగా అంచనావేసినారు. ఈ  బడ్జెట్ లో 34 శాతం అప్పుల తో వికసిత భారత్ కలనెరవేరుతుందా  అని తెలంగాణ యూనివర్సిటీ అర్థశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ ఎం పున్నయ్య వివరించారు.