ఎస్సీ వర్గీకరణ అమలుపై సీఎంతో చర్చిస్తా

– మంత్రి దామోదర రాజనర్సింహ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఎస్సీ వర్గీకరణ అమలుపై సీఎం రేవంత్‌ రెడ్డితో చర్చించి, అమలుకు కృషి చేస్తానని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. బుధవారం మంత్రితో ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ, మాదిగ సామాజిక వర్గానికి చెందిన శాసనసభ్యులు, ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌, డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ, వేముల వీరేశం, కాలే యాదయ్య, మందుల శామ్యూల్‌ సమావేశమయ్యారు. సుప్రీంకోర్టు తీర్పు త్వరితగతిన అమలయ్యేలా చూడాలని వారు మంత్రిని కోరారు. ఈ సమావేశంలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన మేధావులు ప్రొఫెసర్‌ మల్లేశం, ప్రొఫెసర్‌ ఖాసీం, సీనియర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కొండేటి మల్లయ్య, విజరు కుమార్‌ ముంజగళ్ళ, బాపిరాజు, ఎమ్మార్పీఎస్‌ నాయకులు మేడి పాపయ్య మాదిగ, గోవింద్‌ నరేష్‌లు పాల్గొన్నారు.