న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తా..

– హెచ్ ఆర్ సీ ని ఆశ్రయిస్తా..
– న్యాయ పోరాట నిరసన పాదయాత్ర 
నవతెలంగాణ – తంగళ్ళపల్లి
నన్ను మోసగించిన వారిపై న్యాయపోరాటం చేయడమే కాకుండా, నాకు న్యాయం జరిగేంతవరకు మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయిస్తానని మిట్టపల్లి శ్రీకాంత్ అన్నారు. న్యాయ పోరాట నిరసన పాదయాత్రను బాధితుడు మిట్టపల్లి శ్రీకాంత్ శనివారం సిరిసిల్ల జిల్లా కేంద్రం నుండి హైదరాబాద్ వరకు పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి అయిన లగిశెట్టి శ్రీనివాస్ కోసం పిఆర్వోగా పని చేస్తూ అసెంబ్లీ ఎన్నికల సర్వే చేపట్టడం జరిగిందన్నారు. ఈ సర్వే కోసం నాతో పాటుగా మరి కొంతమంది యువకులతో సర్వే నిర్వహించి రిపోర్టును అందజేయాలి లగిశెట్టి శ్రీనివాస్, గుంటుక మహేష్,ఏలూరి రవికిరణ్ లు మమ్మల్ని కోరారని తెలిపారు.దానికోసం కొంత పారితోషకాన్ని అందిస్తానని చెప్పి ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా అందించలేదని వాపోయాడు. పలుమార్లు మాకు ఇవ్వాల్సిన పారితోషకాన్ని ఇవ్వకుండా కాలయాపన చేసి మాపై దురుసుగా ప్రవర్తించారని మండిపడ్డారు. మనస్థాపానికి గురైన నేను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని వాపోయాడు. దీంతో పోలీసులను ఆశ్రయించగా పోలీసులు కూడా నాపైనే కేసు నమోదు చేశారని తెలిపారు. పోలీస్ స్టేషన్లో కూడా తనకు న్యాయం జరగడం లేదని హెచ్ఆర్సీని ఆశ్రయించనునట్లు తెలిపారు. అందుకే న్యాయ పోరాట నిరసన కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.సిరిసిల్ల నుండి హైదరాబాద్ వరకు పాదయాత్ర  నేరుగా మానవ హక్కుల కమిషన్ను కలిసి నాకు అన్యాయం చేసిన వారిపై ఫిర్యాదు చేయనున్నట్లు వారు తెలిపారు.