అటవీ ప్రాంతంలో గుప్తనిధుల వేట ఆగేనా.! 

నవతెలంగాణ –  అచ్చంపేట
నల్లమల్ల ప్రాంతం అచ్చంపేట నియోజకవర్గం లోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో గత ప్రభుత్వం హయాంలో గుప్తనిధుల వేట జోరుగా కొనసాగింది. ప్రతాప రుద్రుని  కోట, అటవీ ప్రాంతంలోని పురాతనమైన దేవాలయాలను ధ్వంసం చేసిన సంఘటనలు అనేకంగా ఉన్నాయి.  ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అచ్చంపేట నియోజకవర్గం లో కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలుపొందారు. నల్లమలను  గుప్త నిధుల తవ్వకాలకు కళ్లెంపడేనా అంటూ నియోజకవర్గంలో చర్చ బలంగా జరుగుతుంది. గతంలో నల్లమల అటవీ ప్రాంతంలో ప్రతాపరుద్దుని కోట, అక్కమ్మ గుహలు, బౌరాపూర్,లలో గుప్తనితత్వకాలు జరిగాయి. రాజకీయ జోక్యంతో తాత్కాలిక కేసులు నమోదు చేసి చేతులు దులుపుకున్నారని ఆరోపణలు ఉన్నాయి.  అయితే. మండలాలలో అటవీ ప్రాంతంలో ఉన్న పురాతన దేవాలయంలో గుప్తనిధులు తవ్వుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పదిహేను రోజుల క్రితం కొల్లాపూర్  అటవీ ప్రాంతంలో గుప్తనిధుల వేట కొనసాగిందన్న విషయం వార్త కథనాలు విషయం అందరికి తెలిసిందే…!కొంత మంది బయటి ప్రాంతం నుండి వచ్చి అటవీ ప్రాంతంలో నివసిస్తున్న వారితో  స్నేహపూర్వక సంబంధాలు ఏర్పరచుకొని అడవి ప్రాంతంలో ఉంటూ…. గుప్త నిధుల తవ్వకాలకు ప్రణాళికలు రూపొందిస్తారని ప్రచారం జరుగుతుంది. వీరికి ఫారెస్ట్ అధికారుల అండదండలు లేకుండా ఎలా అడవిలోకి పోతారనే  చర్చ జరుగుతుంది. గుప్త నిధులు తవ్విన తర్వాత బహిర్గతం చేయడం కన్నా ముందు ఏర్పాటుచేసి అనుమతులు లేకుండా అడవిలోకి వెళ్తున్న వారిని పట్టుకొని చర్యలు తీసుకుంటే…. నల్లమలలో గుప్తనిధుల వేట కు బ్రేక్
పడుతుందని పలువురు చర్చించుకుంటున్నారు. ఈ దిశగా ఫారెస్ట్ ఉన్నది అధికారులు ఆలోచన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.