
– మండలానికి 5వేలకు పైనే పాఠ్య పుస్తకాలు అవసరం
నవతెలంగాణ – మల్హర్ రావు
నూతన విద్య సంవత్సరం జూన్ 12న ప్రారంభం కానుంది. మండలంలోని ప్రభుత్వ పాఠశాలకు కావాల్సిన పాఠ్య పుస్తకాలు ఇప్పటికే జిల్లా కేంద్రానికి చేరినట్లుగా తెలుస్తోంది.కానీ మండలానికి తరలించడంలో అలస్యమవుతుంది. దీంతో విద్యార్థులకు సకాలంలో పుస్తకాలు సకాలంలో అందేనా.? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు పర్యటిస్తున్న ఇంకా పుస్తకాలు రాలేదు.
ఎంఆర్సీ భవనానికి చేరని వైనం..
ప్రభుత్వ బడుల్లో, వసతి గృహాల్లో చదివే విద్యార్థులకు అవసరమైయ్యే పాఠ్య,నోట్ పుస్తకాలు జిల్లాకు చేరుకున్నట్లుగా తెలిసింది. కానీ మండలానికి చేరకపోవడంతో ఇబ్బందులు ఎదురైయ్యే అవకాశాలున్నాయి.దీంతో ఈసారైనా పాఠ్య పుస్తకాల పంపిణీ విద్యాశాఖ సకాలంలో పూర్తి చేస్తుందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.గతేడాది సరిగ్గా సరఫరా చేయకపోవడంతో ప్రభుత్వ పాఠశాలలకు పాఠ్య పుస్తకాలు సకాలంలో ఇవ్వలేదు.నెల రోజులు ఆలస్యంగా అందడంతో విద్యాబోధనకు అనేక ఆటంకాలు ఏర్పడ్డాయి.ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని పాఠశాలలు ప్రారంభం కాకముందే పాఠ్య పుస్తకాలు అందించాలంటే మండల విద్యాశాఖ అధికారులు పాఠ్య పుస్తకాలు మండలంలోని కొయ్యుర్ ఎంఆర్సి భవనానికి తరలించే ప్రయత్నం చేయాలని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
మండల పరిస్థితి ఇలా..
మండలంలో 5 జిల్లా పరిషత్, 27 ప్రాథమిక పాఠశాలలు, రెండు ప్రాథమికోన్నత, ఒక మోడల్ స్కూల్,ఒక కస్తూర్బా ఆశ్రమ పాఠశాల మొత్తం 37 పాఠశాలలు ఉన్నాయి.ఇందులో 1848 మంది విద్యార్థులు విద్యానబ్యసిస్తున్నారు.వీరికి ఈ ఏడాది 5,378 పాఠ్య పుస్తకాలు అవసరమవుతున్నాయి. గత విద్య సంవత్సరంలో ఇప్పటికే 20 శాతం పంపిణీ చేశారు.కానీ ఈ విద్య సంవత్సరం ఇంకా పుస్తకాలే చేరలేదు.పాఠశాలలు పున ప్రారంభానికి ముందే మండల విద్యాశాఖ కార్యాలయానికి అధికారులు పాఠ్య పుస్తకాలు అందించాల్సి ఉంది.కానీ ఈ ప్రక్రియ నెమ్మదిగా కొనసాగుతుంది.ఈసారి కూడా పాఠ్య పుస్తకాల పంపిణీకి ఇబ్బందులు ఎదురైయ్యే అవకాశాలున్నాయి.
సకాలంలో అందిస్తాం…ఇంచార్జి ఎంఈఓ..
పాఠ్య పుస్తకాలు సకాలంలో అందిస్తాం.ఇందుకు సంబంధించిన సరఫరా కార్యక్రమం వేగంగా కొనసాగుతుంది.ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నాం. జిల్లా కేంద్రానికి ఇప్పటికే పాఠ్య పుస్తకాలు చేరాయి. త్వరలో మండల కేంద్రానికి వస్తాయి.