నవతెలంగాణ-తొర్రూరు
రానున్న అసెంబ్లీ ఎన్నిక ల్లో జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ అభ్య ర్థిగా ఝాన్సీ రెడ్డి పేరు బలం గా వినిపిస్తుంది. నియోజక వ ర్గంలో రెడ్డి సామాజిక వర్గం అధికంగా ఉండడంతో ఆ వర్గానికి చెందిన బలమైన అ భ్యర్థిని పోటీలో దించేం దుకు కాంగ్రెస్ అధిష్టానం ఆలోచి స్తుంది. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకుర్తి నియోజకవర్గం లో బలమైన కాంగ్రెస్ అభ్యర్థిని బరిలో దించాలని కాంగ్రెస్ అధిష్టానం యోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో తొరూరు మండలం చెర్లపాలెం గ్రామానికి చెందిన అనుమాండ్ల రాజేందర్ రెడ్డి, ఝాన్సీ రెడ్డి దంపతులు అమెరికాలో స్థిరపడ్డారు. 25 సంవత్సరాల క్రితమే తొరూరు కేంద్రంగా 30 పడకల ఆసుపత్రి నిర్మాణం, నెల్లికుదురు మండలంలో పలు పాఠశాలలు నిర్మించారు. ప్రతి సంవత్సరం నియోజకవర్గంలో ఏదో ఒక సేవా కార్యక్రమం నిర్వహిస్తుంటారు. ఈ ప్రాంత ప్రజలతో, నాయకులతో మంచి పరిచయాలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో డాక్టర్ రాజేందర్ రెడ్డి, ఝాన్సీ రెడ్డి దంపతులపై ఇక్కడి ప్రజల్లో ఎంతో అభిమానం ఉంది. ఝాన్సీ రెడ్డి రాజకీయాల్లోకి వస్తుండడంతో నియోజకవర్గంలో ఎర్రబెల్లికి గట్టి పోటీ ఇస్తుందనే చర్చ నియోజకవర్గంలో జరుగుతుంది. కాంగ్రెస్ అధిష్టానం ఈనెల 14న లేదా 15వ తేదీన పాలకుర్తి నియోజకవర్గం లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఝాన్సీ రెడ్డి పేరును ప్రకటించనున్నట్లు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రణాళిక రూపొందిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇదే నిజమైతే పాలకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనే దానిపై గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారానికి తెరపడనుంది.