మంత్రివర్గ విస్తరణలో జుక్కల్ నియోజకవర్గానికి చోటు దక్కేనా..

Will Jukkal constituency get a place in the expansion of the cabinet?– వెనుకబడ్డ జుక్కల్ అభివృద్ధికి మంత్రి పదవి ఇవ్వాలి నియోజకవర్గ ప్రజల విన్నపం..
నవతెలంగాణ – మద్నూర్
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ త్వరలో జరుగుతుంది అంటూ వినబడుతున్న చర్చల్లో భాగంగా మంత్రివర్గ విస్తరణలో జుక్కల్ నియోజకవర్గానికి చోటు దక్కేనా వెనుకబడ్డ జుక్కల్ అభివృద్ధికి మంత్రి పదవి ఇవ్వాలి అంటూ నియోజకవర్గం ప్రజలు కోరుకుంటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కి విన్నవించుకుంటున్నారు. ఈ నియోజకవర్గంలో ఏర్పడ్డ నాటి నుండి నేటి వరకు ఎన్ని ప్రభుత్వాలు అధికారం చేపట్టిన అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు గెలుపొందిన మంత్రివర్గంలో చోటు దక్కకపోవడం విశేషం. ఉమ్మడి రాష్ట్రంలో గాని, ప్రత్యేక రాష్ట్రంలో గాని, మంత్రివర్గంలో చోటు దక్కని నియోజకవర్గం జుక్కల్, గడిచిన పదేళ్ల కాలంలో అధికారంలో కొనసాగిన బిఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా జుక్కల్ ఎమ్మెల్యే అధికార పార్టీకి చెందిన వారు గెలిచినప్పటికీ, మంత్రి పదవిలో చోటు దక్కలేదు. ప్రస్తుతం అధికారంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొనసాగుతోంది. జుక్కల్ ఎమ్మెల్యేగా అధికార పార్టీకి చెందిన తోట లక్ష్మీకాంతరావు కొనసాగుతున్నారు. అధికారంలో ఒక సంవత్సరం గడిచిపోయింది.
మంత్రివర్గ విస్తరణ కోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం చేపట్టబోయే మంత్రివర్గ విస్తరణంలోనైనా జుక్కల్ కు చోటు దక్కాలని నియోజకవర్గ ప్రజల విన్నపం పూర్తిగా వెనుకబడ్డ ప్రాంతం. అభివృద్ధికి మంత్రివర్గంలో చోటు లభిస్తే అభివృద్ధి మరింతగా చెందుతుందని జుక్కల్ కు ఎమ్మెల్యేగా గెలుపొందిన తోటా లక్ష్మి కాంతారావు ఉన్నత చదువులు చదివిన వ్యక్తిగా.. ఎస్సీ  రిజర్వుడు కాన్స్టెన్సీ కి మంత్రివర్గంలో చోటు కల్పించాలని ఏళ్ల తరబడి ఈ నియోజకవర్గంలో ప్రజలు కోరుకుంటున్నారు. ఎస్సీ రిజర్వుడుగా జుక్కల్ కాన్స్టెన్సీ 1978లో ఏర్పడింది. ఎస్సీ రిజర్వుడు కానిస్టెన్సీగా ఏర్పడి 46 సంవత్సరాలు గడుస్తున్నాయి. ఈ 46 సంవత్సరాల కాలంలో 11 సార్లు ఎన్నికలు జరగగా.. వీటిలో సౌధాగర్ గంగారం నాలుగు సార్లు ఎమ్మెల్యేగా అయ్యారు. మూడుసార్లు హనుమంతు షిండే ఎన్నికయ్యారు. రెండుసార్లు బి పండరి ఎన్నికయ్యారు. ఒకసారి అరుణతార ఎన్నిక కాగా.. ప్రస్తుతం జుక్కల్ ఎమ్మెల్యేగా తోట లక్ష్మీకాంతరావు కొనసాగుతున్నారు. 11 సార్లు ఎన్నికల్లో అధికార పార్టీలో గెలుపొందిన వారే ఉన్నప్పటికీ ఏ ఒక్కరికి కూడా మంత్రి పదవిలో చోటు దక్కలేదు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో కొనసాగుతోంది. ఇప్పటికైనా ఉన్నత చదువులు చదివిన తోట లక్ష్మి కాంతారావుకు మంత్రి పదవి కల్పించాలని, నియోజకవర్గ ప్రజలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. వెనుకబడ్డ జుక్కల్ ప్రాంత అభివృద్ధికి ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు ప్రత్యేక కృషి చేస్తున్నారు. మంత్రి పదవి కల్పిస్తే వెనుకబడ్డ జుక్కల్ ప్రాంత అభివృద్ధికి మేలు జరుగుతుందని ప్రజలు విన్నవించుకుంటున్నారు. కానిస్టెన్సీ ఏర్పడ్డ నాటినుండి నేటి వరకు మంత్రివర్గంలో చోటు దక్కని నియోజకవర్గం ఏది అంటే రాష్ట్రంలోనే జుక్కలని చెప్పవచ్చు. ఎందుకంటే ఎన్నిసార్లు ఎన్నికలు జరిగినా ఎన్నిసార్లు ప్రభుత్వాలు మారినా.. జుక్కల్ కాన్స్టెన్సీకి అధికార పార్టీ చిన్నచూపు చూపుతూ మంత్రివర్గంలో చోటు కల్పించలేకపోతుందని నియోజకవర్గం ప్రజల్లో అభిప్రాయం వ్యక్తం అవుతుంది. రేపో మాపో జరగబోయే మంత్రివర్గ విస్తరణంలో జుక్కల్ కు చోటు కల్పించాలని నియోజకవర్గం ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.