నవతెలంగాణ కమ్మర్ పల్లి
కాంగ్రెస్ పార్టి బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జి ముత్యాల సునీల్ కుమార్ కార్యకర్తలకు అండగా ఉండి ఎటువంటి కష్టం రానివ్వనని కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జి ముత్యాల సునీల్ కుమార్ అన్నారు. ఆదివారం మండల కేంద్రం శివారులోని లలితా గార్డెన్స్ లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఓటమి పాఠం నేర్పిందని నైతికంగా గెలుపు మనదేనని, ఎన్నికల్లో మితిమీరిన ధన ప్రవాహం వల్ల ఓటమి మూటగట్టుకోవాల్సి వచ్చిందని అన్నారు. టిఆర్ఎస్ పార్టీ అక్రమ ధన సంపాదన ప్రజలపై వెదజల్లి గెలిచిందని, అమాయక ప్రజలు డబ్బుకు మోసపోయారని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం నియోజకవర్గంలో అభివృద్ధి బాధ్యతను తానే తీసుకుంటానన్నారు. కార్యకర్తలు గ్రామాల్లో అభివృద్ధి పనుల్లో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.ఎన్నికల్లో మోసం చేసిన ఇంటి దుష్టశక్తులను వదిలిపెట్టేది లేదని, అంతా ముఖ్యమంత్రికి తెలుసని వాళ్ళ పని ఆయనే చూసుకుంటారని అన్నారు.కాంగ్రెస్ పార్టీ గెలుపు కొరకు అవిశ్రాంతంగా పనిచేసిన కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందించే పనిలో కార్యకర్తలు నిమగ్నం కావాలన్నారు. గ్రామాల్లో ఎక్కడెక్కడ ఏ అభివృద్ధి పనులు చేయాలో గుర్తించాలని, అవసరమైన చోట అభివృద్ధి పనులను తెచ్చుకుందామని తెలిపారు.రానున్న స్థానిక సంస్థలు సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కొరకు కార్యకర్తలు కృషి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.