పరిశ్రమకు అండగా ఉంటా..

Will stand by the industry..తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ జన్మదిన వేడుక తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా జరిగింది. హైదరాబాద్‌ యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి స్టేడియంలో జరిగిన ఈ వేడుకలో చలనచిత్ర వాణిజ్యమండలి అధ్యక్షులు దిల్‌రాజు, నిర్మాతలు దామోదర ప్రసాద్‌, చినబాబు, నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్నకుమార్‌, సి.కళ్యాణ్‌, రఘుబాబు, పథ్వి, మాదాల రవి, చిత్రపురి కాలనీ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ అనిల్‌, దొరై, సినీ జర్నలిస్ట్‌ సంఘం తరపున సురేష్‌ కొండేటి, లక్ష్మీనారాయణతోపాటు 24 క్రాఫ్ట్‌కు చెందిన నాయకులు, కార్మికులు వేలాదిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కతిక కార్యక్రమాలు ఆహూతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అలాగే మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ తనయుడు తలసాని సాయి యాదవ్‌ తన తండ్రిపై ఓ రాయించిన ఓ ప్రత్యేక గీతాన్ని విడుదల చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి తలసాని మాట్లాడుతూ, ‘చిత్ర పరిశ్రమకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా నేను ముందు ఉంటాను. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరిశ్రమ సమస్యల పరిష్కారం పట్ల ఎప్పుడూ సానుకూలంగా ఉంటారు’ అని తెలిపారు.