
– సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు ఎగమంటి ఎల్లారెడ్డి డిమాండ్..
నవతెలంగాణ – వేములవాడ:
ఎన్నికల బిజీలో ఉండిపోయి జిల్లా స్థాయి అధికారులు రైతులు పండించిన వారి ధాన్యాన్ని కొనుగోలు చేయడం మరిచిపోతారని సీపీఐ(ఎం) నాయకులు ప్రశ్నించారు, రైతులు వరి ధాన్యాన్ని కోసి ఆయా గ్రామాలలో కేంద్రాలలోని తీసుకువచ్చి ఆరపుస్తున్న ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించలేదని అన్నారు. వేములవాడ డివిజన్ కేంద్రంలో భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు ( సీపీఐ(ఎం)) పార్టీ ఆధ్వర్యంలో గురువారం స్థానిక సిఐటియు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎగమంటి ఎల్లారెడ్డి మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా కేంద్రాలలో ఐకెపి ధాన్యం కొలుగోలు కేంద్రాలను సొసైటీ కేంద్రాలను వెంటనే అధికారులు ప్రారంభించాలని అన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని వేగంగా కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికే రైతులు తమ పంట పొలాలను కోసి సంబంధిత కేంద్రాలకు వడ్లు తీసుకొచ్చి ఆరబెడుతున్నారని పంట పోలాలను కోసి 15 రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడం సిగ్గుచేటనీ తెలిపారు. అధికారు లందరూ ఎన్నికల నేపథ్యంలో బిజీగా ఉంటూ రైతులను మర్చిపోతున్నారని సకాలంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడం వల్ల రైతులు చేసేదేమీ లేక దళారులకు తక్కువ ధరలు వడ్లను అమ్ముకొని నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ మద్దతు ధర కంటే దళారులు తక్కువ రేటుకు వడ్లు కొనడం వల్ల ఆరుకాలం పండించిన పంటకు మద్దతు ధర లేకపోవడంతో రైతుల నష్టపోతున్నారని అన్నారు. దళారులు ఒక క్వింటాలకు 1700 నుంచి 1800 వరకు కొంటున్నారని అదే ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర రెండు వేలపైనా ఉంటుందని తెలిపారు. వెంటనే రైతు నష్టపోకుండా కొనుగోలు కేంద్రంలో ప్రారంభించాలని డిమాండ్ చేశారు. గతంలో కూడా సకాలంలో రైతు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడం వల్ల రైతులు పండించిన పంట వానకు తడుస్తూ ఎండకు ఎండుతూ రైతులు తీవ్రంగా నష్టపోవడం జరిగిందని, వెంటనే వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించక పోతే రైతులందరికీ కలుపుకొని పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మాల్లారపు ప్రశాంత్, అశోక్, వేణు తదితరులు పాల్గొన్నారు.