
రాష్ట్రవ్యాప్తంగా గ్రామపంచాయతీలో పనిచేసే కార్మికులకు న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ అనుబంధ రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీలు ఇచ్చిన ఈనెల 8న ఒకరోజు సమ్మె చేపట్టి డిమాండ్ల పరిష్కారానికి నిరసన తెలుపాలని ఇచ్చిన పిలుపును ప్రతి గ్రామపంచాయతీలో పనిచేసే కార్మికులంతా సమ్మె చేపడతారా అనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఈనెల ఐదు నుండి తొమ్మిదవ తేదీ వరకు స్వచ్ఛ ధనం పచ్చదనం కార్యక్రమాలు చేపడుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా రోజుకు వారి కార్యక్రమాలతో ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా జరుపుతున్నారు. కార్మికుల డిమాండ్ల పరిష్కారం కోసం ఆ సంఘం రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీలు ఇచ్చిన పిలుపు విజయవంతం అయ్యేనా అనే వాదనలు ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి. పంచాయతీల్లో పని చేసే కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని కార్మికులందరికీ పర్మినెంట్ చేయాలని కనీస వేతనాలు అమలు పరచాలని మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేయాలని కారోబార్లను బిల్ కలెక్టర్లను సహాయ కార్యదర్శులుగా నియమించాలని ప్రభుత్వమే కార్మికుల వేతనాలకు ప్రత్యేక గ్రాండ్ కేటాయించాలని పిఆర్సి లో అర్హులుగా గుర్తించాలని, దాదాపు 11 డిమాండ్లతో ప్రభుత్వానికి నిరసన తెలిపేందుకు ఈనెల 8న సమ్మె చేపట్టాలని పిలుపునివ్వడం జరిగింది. కార్మికులంతా కార్మిక సంఘాల పిలుపుమేరకు సమ్మెలో పాల్గొంటారా లేక అధికారుల ఒత్తిళ్లకు విధుల్లో పాల్గొంటారా ఈనెల 8న చేపట్టబోయే సమ్మె వేచి చూడాలి.